Pudina Tea: పుదీనా టీతో బ్రెయిన్ రీ ఫ్రెష్ అయిపోతుంది.. ఇన్ఫెక్షన్లు దూరం!

Updated on: Jan 19, 2025 | 6:28 PM

పుదీనా గురించి పరిచయాలు అవసరం లేదు. చాలా మంది ఉపయోగించే వాటిల్లో పుదీనా కూడా ఒకటి. పుదీనా ఇంట్లో ఉంటే దోమలు, ఈగలు వంటివి ఇంట్లోకి రాకుండా ఉంటాయి. పుదీనాతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పుదీనా టీ తాగితే ఈ సమస్యలు రాకుండా ఉంటాయి..

1 / 5
పుదీనా అంటే చాలా మందికి ఇష్టం. ఈ ఫ్లేవర్‌తో ఏం చేసినా చాలా రుచిగా ఉంటాయి. పుదీనాని ఎక్కువగా బిర్యానీ, మసాలా వంటలు తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. పుదీనాతో టీ కూడా తయారు చేసుకోవచ్చు.

పుదీనా అంటే చాలా మందికి ఇష్టం. ఈ ఫ్లేవర్‌తో ఏం చేసినా చాలా రుచిగా ఉంటాయి. పుదీనాని ఎక్కువగా బిర్యానీ, మసాలా వంటలు తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. పుదీనాతో టీ కూడా తయారు చేసుకోవచ్చు.

2 / 5
పుదీనా టీ తాగడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. పుదీనా ఆరోగ్యానికి మంచిది. ప్రతి రోజూ ఓ చిన్న గ్లాస్ పుదీనా టీ తాగితే శరీరంలో ఉండే మలినాలు, విషపదార్థాలు అన్నీ బయటకు పోతాయి. బాడీ డీటాక్స్ అవుతుంది.

పుదీనా టీ తాగడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. పుదీనా ఆరోగ్యానికి మంచిది. ప్రతి రోజూ ఓ చిన్న గ్లాస్ పుదీనా టీ తాగితే శరీరంలో ఉండే మలినాలు, విషపదార్థాలు అన్నీ బయటకు పోతాయి. బాడీ డీటాక్స్ అవుతుంది.

3 / 5
జీర్ణ సమస్యలన్నీ పోతాయి. అజీర్తి, గ్యాస్, మలబద్ధకం సమస్య తగ్గుతుంది. మజ్జిగా పుదీనా ఆకుల పేస్ట్ కలిపి తాగితే.. చర్మానికి కూడా చాలా మంచిది. చర్మం షైనీగా మారుతుంది.

జీర్ణ సమస్యలన్నీ పోతాయి. అజీర్తి, గ్యాస్, మలబద్ధకం సమస్య తగ్గుతుంది. మజ్జిగా పుదీనా ఆకుల పేస్ట్ కలిపి తాగితే.. చర్మానికి కూడా చాలా మంచిది. చర్మం షైనీగా మారుతుంది.

4 / 5
పుదీనా టీ తాగడం వల్ల ఎంతో రీ ఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. బ్రెయిన్ కూడా రిలాక్స్ అవుతుంది. ఒత్తిడిగా, ఆందోళనగా ఉన్నప్పుడు పుదీనా తాగితే.. స్ట్రెస్ తగ్గి మళ్లీ యాక్టీవ్ అవుతారు. నోటి ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.

5 / 5
శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వైరస్, ఇన్ఫెక్షన్లు దరి చేరకుండా ఉంటాయి. ఈ టీ తాగితే జలుబు, దగ్గు వంటివి కూడా కంట్రోల్ అవుతాయి. గర్భిణీలు కూడా ఎలాంటి డౌట్ లేకుండా ఈ టీ తాగవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వైరస్, ఇన్ఫెక్షన్లు దరి చేరకుండా ఉంటాయి. ఈ టీ తాగితే జలుబు, దగ్గు వంటివి కూడా కంట్రోల్ అవుతాయి. గర్భిణీలు కూడా ఎలాంటి డౌట్ లేకుండా ఈ టీ తాగవచ్చు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)