Shiva Prajapati |
Apr 02, 2023 | 6:00 PM
అబ్బాయిలు అందం గురించి పెద్దగా పట్టించుకోరని, చర్మ రక్షణ చర్యలు తీసుకోరని ఒక టాక్. అయితే, దీనికి కారణం ఏంటంటే మాత్రం ఇప్పటికీ నో ఆన్సర్.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అబ్బాయిలు తమ చర్మాన్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. పురుషుల చర్మంలో కొల్లాజెన్, ఎలాస్టిన్ ఎక్కువగా ఉంటాయి. ఇది చర్మాన్ని పొడిగా, గరుకుగా చేస్తుంది.
పురుషులలో మొటిమల సమస్యలు వస్తాయి. ఈ సమస్య తగ్గాలంటే సరైన చర్మ సంరక్షణ అవసరం. చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం. ఫేస్‌వాష్‌తో చర్మాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోండి. మాయిశ్చరైజర్‌ని క్రమం తప్పకుండా వాడాలి. ఇది చర్మంలో తేమను నిలుపుకోవడానికి సహాయపడుతుంది.
ఎండలోకి వెళ్లే ముందు సన్‌స్క్రీన్ ఉపయోగించడం మర్చిపోవద్దు. ఇది సూర్యుని నుంచి వచ్చే హానికరమైన ప్రభావాల నుండి చర్మాన్ని కాపాడుతుంది.
షేవింగ్ తర్వాత ఆఫ్టర్ షేవ్ ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. ఇది చర్మ గాయాలను నివారిస్తుంది. అలాగే రాత్రి పడుకునే ముందు నైట్ క్రీమ్ రాసుకోవాలి. ఇది చర్మాన్ని అందంగా, తాజాగా చేస్తుంది.