Meal Maker: రుచిలో మటన్‌తో పోటీపడే మిల్‌మేకర్ కర్రీ! అన్నం, రోటీ, బిర్యానీ ఏదైనా సరే లొట్టలేయాల్సిందే

Updated on: Oct 25, 2026 | 7:49 PM

ప్రొటీన్లు పుష్కలంగా లభించే శాకాహార వనరులలో సోయా చంక్స్ అగ్రస్థానంలో ఉంటాయి. నాన్‌వెజ్ తినని వారికి లేదా మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా ఏదైనా మంచి ఘాటైన మసాలా కూర తినాలనుకున్నప్పుడు.. మటన్ కర్రీ రుచిని తలపించేలా 'మిల్‌మేకర్ మసాలా గ్రేవీ' వండుకుంటే తిరుగులేని రుచితో ఉంటుంది. సాధారణంగా మిల్‌మేకర్ కూర చేసేటప్పుడు చంక్స్ లోపలికి మసాలా సరిగ్గా వెళ్లక చప్పగా ఉంటాయని లేదా రబ్బరులా సాగుతాయని కొందరు అంటుంటారు. 

1 / 5
కావలసిన పదార్థాలు: 1 కప్పు మిల్‌మేకర్, 2 మీడియం సైజు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 2 మీడియం సైజు టమాటాలు, 1 టేబుల్ స్పూన్ తాజా అల్లం-వెల్లుల్లి పేస్ట్, పావు టీస్పూన్ పసుపు, 1½ నుండి 2 టీస్పూన్ల కారం పొడి , రుచికి సరిపడా ఉప్పు, తాలింపు కోసం బిర్యానీ ఆకు – 1, లవంగాలు – 3, దాల్చినచెక్క – చిన్న ముక్క, 2 నుండి 3 పచ్చిమిరపకాయల చీలికలు, 1  రెమ్మ కరివేపాకు, కొద్దిగా తాజా కొత్తిమీర తరుగు, 1 టీస్పూన్ కసూరి మేథీ, 3 నుండి 4 టేబుల్ స్పూన్ల వంట నూనె, మిల్‌మేకర్ నానబెట్టడానికి & గ్రేవీ కోసం తగినన్ని వేడి నీళ్లు, స్పెషల్ మసాలా పేస్ట్ కోసం: 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్  గసగసాలు, 6 నుండి 8 పలుకుల జీడిపప్పు, లవంగాలు – 3, యాలకులు – 2, దాల్చినచెక్క – అర అంగుళం ముక్క

2 / 5
తయారీ విధానం: గిన్నెలో నీళ్లు పోసి అర టీస్పూన్ ఉప్పు వేసి మరిగించాలి. నీళ్లు మరిగాక స్టవ్ ఆఫ్ చేసి 1 కప్పు మిల్‌మేకర్ వేసి మూతపెట్టి 10 నిమిషాలు ఉంచాలి. అవి రెట్టింపు సైజులోకి ఉబ్బిన తర్వాత నీటిని వడకట్టి.. చల్లటి నీళ్లలో వేసి చేతులతో గట్టిగా నొక్కుతూ చుక్క నీరు లేకుండా పిండి పక్కన ఉంచుకోవాలి. మసాలా కోసం తీసుకున్న ధనియాలు, జీలకర్ర, గసగసాలు, జీడిపప్పు, హోల్ గరం మసాలా దినుసులను కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ జార్‌లో చాలా మెత్తటి ఫైన్ పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.

3 / 5
స్టవ్‌పై కడాయి పెట్టి 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చినచెక్క, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం మంటపై వేపాలి. ఉల్లిపాయలు వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేయించాలి.

4 / 5
ఇప్పుడు పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి.. సిద్ధం చేసుకున్న తాజా మసాలా పేస్ట్, టమాటా ప్యూరీని వేయాలి. మంటను లో-మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మసాలాలోని పచ్చిదనం పోయి అంచుల వెంట నూనె పైకి తేలే వరకు 4-5 నిమిషాలు మూతపెట్టి మగ్గించాలి. నూనె చక్కగా పైకి తేలిన తర్వాత పిండి ఉంచుకున్న మిల్‌మేకర్ ముక్కలను వేసి మసాలా మొత్తం వాటికి పట్టేలా 2 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత కావలసిన గ్రేవీ చిక్కదనానికి సరిపడా (సుమారు 1 నుండి 1½ కప్పులు) వేడి నీళ్లు పోసి బాగా కలపాలి.

5 / 5
మూతపెట్టి మీడియం మంటపై 5 నుండి 7 నిమిషాలు మిల్‌మేకర్ మసాలాను లోపలి దాకా పీల్చుకుని గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించాలి. చివరగా నలిపిన కసూరి మేథీ, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, నోరూరించే మటన్ రుచితో కూడిన 'మిల్‌మేకర్ మసాలా కర్రీ' సిద్ధం! వేడివేడి అన్నం, బగారా రైస్, పులావ్, బిర్యానీల్లోకైనా లేదా చపాతీ, రోటీ, పూరీల్లోకైనా నంజుకుని తింటుంటే అద్భుతమైన రుచితో కడుపు నిండిపోతుంది !

Loading...
Unable to load recommendations.
Follow Us