
మాచా గ్రీన్ టీ జపాన్‌కు చెందిన ఒక రకమైన గ్రీన్ టీ. దీనిలో ఆకుపచ్చ ఆకులను పొడిగా చేసి ఉపయోగిస్తారు. సాధారణ గ్రీన్ టీలో ఆకులను నీటిలో నానబెట్టి ఉపయోగిస్తారు. అయితే ఈ మాచా టీలో మొత్తం పొడిని ఉపయోగిస్తారు. హెల్త్‌లైన్ ప్రకారం మాచా గ్రీన్ టీలో గుండె ఆరోగ్యం, బరువు తగ్గడం, ఆరోగ్యానికి ప్రయోజనకరమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

మాచా గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఎ, సి, కె, ఇ , బి కాంప్లెక్స్, సెలీనియం, క్రోమియం, జింక్, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు కూడా ఉన్నాయి. ఈ గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే ఇందులో కెఫిన్ మొత్తం సాధారణ గ్రీన్ టీ కంటే ఎక్కువ.

హెల్త్‌లైన్ ప్రకారం ఈ మాచా గ్రీన్ టీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రయోజనకరంగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు కనుగొన్నాయి. 2015 అధ్యయనంలో మాచా గ్రీన్ టీ తాగడం వల్ల కాలేయ వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని తేలింది. హెల్త్‌లైన్ ప్రకారం 2020 అధ్యయనంలో మాచా గ్రీన్ టీ ఆల్కహాల్ లేని ఫ్యాటీ లివర్ వ్యాధిని తగ్గిస్తుందని కనుగొంది.

మాచా గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో అధిక మొత్తంలో కెఫిన్ , అల్లంటోయిన్ ఉంటాయి. దీనివల్ల ఇవి శక్తి , దృష్టిని పెంచడంలో సహాయపడతాయి. ఇందులో అధిక మొత్తంలో క్లోరోఫిల్ ఉంటుంది. దీనివల్ల ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది.

మాచా గ్రీన్ టీలో కేలరీలు తక్కువగా ఉంటాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే మాచా గ్రీన్ టీ లుటిన్ , కాటెచిన్స్ అనే పోషకాలు ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచుతాయి. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారికి ఈ గ్రీన్ టీ ఉత్తమమైనది.

మాచా గ్రీన్ టీ గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. ఇది మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఇది రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. కనుక అధిక రక్తపోటు ఉన్నవారికి ఇది ఉత్తమమైన పానీయం.