
శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. లేదంటే రోగాలు దాడి చేస్తాయి. మీరు కూడా శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మీ సాధారణ అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇది మిమ్మల్ని వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

శీతాకాలంలో ప్రతి ఉదయం ఉసిరి జ్యూస్‌తో మీ రోజును ప్రారంభించాలి. ఉసిరి జ్యూస్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఉసిరి జ్యూస్ తాగడం వల్ల ఒంట్లో వ్యాధి నిరోధకత పెరిగి వ్యాధులు మీకు దూరంగా ఉంటాయి.

గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందువల్ల ప్రతిరోజూ ఉదయం ఒక చెంచా నెయ్యిని గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

ప్రతి రాత్రి పడుకునే ముందు 5 బాదంపప్పులను నీటిలో నానబెట్టాలి. ఉదయం అల్పాహారానికి కొంత సమయం ముందు ఈ బాదంపప్పులను తినాలి. ఇది ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో సహాయపడుతుంది.

ఎండుద్రాక్షలను నీటిలో నానబెట్టి, రోజులో సమయం దొరికినప్పుడల్లా తింటూ ఉండాలి. ఇది ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. దీనితో పాటు ఎండుద్రాక్ష అనేక ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది.