Business idea: జస్ట్10 వేల పెట్టుబడితో నెలనెలా ఆధాయం! సామాన్యుడిని లక్షాధికారిని చేసే రిస్క్‌లేని బిజినెస్‌లు

Updated on: Jan 13, 2026 | 1:14 PM

Top Home-Based Business Ideas with Low Investment: సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలని చాలా మందికి ఉంటుంది. కానీ ఆర్థిక స్థోమత లేకో లేదా డబ్బులు పెట్టాక నష్టం వస్తుందనే భయంతోనే చాలా మంది వెనకడుగు వేస్తారు. ముఖ్యంగా విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగం చేస్తూ సెకండ్ ఇన్‌కమ్ కోసం ప్రయత్నించే వారిలో ఎక్కువగా ఈ భయం కనిపిస్తుంది. అలాంటి వారికోసమే ఈ వార్త.. మీరు తక్కువ పెట్టుబడితో, రిస్క్‌లేకుండా డబ్బులు సంపాధించుకే కొన్ని బిజినెస్ టిప్స్‌ గురించి మేము ఇప్పుడు చెప్పబోతున్నాం. అవును ఈ బిజినెస్‌లు జస్ట్ రూ.10,000 తో స్టార్ట్ చేస్తే.. నెల నెలా మీకు ఆధాయం తెచ్చిపెడతాయి. ఇంతకూ ఆ సులభమైన వ్యపారాలేంటో చూద్దాం పదండి.

1 / 5
క్లౌడ్ కిచెన్: మీకు ఇంట్లో వంట చేయడంలో మంచి నైపుణ్యాలు ఉంటే, మీరు ఇంట్లోనే చిన్న క్లౌడ్ కిచెన్‌ను స్టార్ట్ చేసుకోవచ్చు.మీరు ఇంట్లోనే ఫుడ్‌ ప్రిపేర్ చేసి వాటిని సేల్‌ చేయవచ్చు. మీరు ఇడ్లీలు, దోస పిండి, సాంబార్, చట్నీలు, సాయంత్రం స్నాక్స్ తయారు చేసి సమీపంలోని దుకాణాలకు సరఫరా చేయవచ్చు. లేకపోతే, మీరు వాటిని స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌ల సహాయంతో ఆర్డర్ల ఆధారంగా నేరుగా కస్టమర్లకు అందించవచ్చు. ఈ బిజినెస్‌కు పెద్ద ఖర్చు ఏముందడదు. కేవలం స్టార్ట్ చేసేప్పుడు కొన్ని  పాత్రలు, ముడి పదార్థాల ధర దాదాపు రూ. 5,000 నుండి రూ. 8,000 వరకు ఖర్చు అవుతుంది. మీ ఫుడ్‌ టేస్టీగా ఉంటే కస్టమర్లు ఫుడ్‌ కోసం క్యూ కడతారు. దీంతో మీరు ఈజీగా లాభాలు సంపాధించొచ్చు.

2 / 5
గ్రామాల్లో డిజిటల్ సేవలు: మీకు కాస్తా కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంటర్నెట్‌పై అవగాహన ఉంటే..  మీరు గ్రామాల్లో డిజిటల్ సేవా సెంటర్‌ను పెట్టుకొని డబ్బులు సంపాదించొచ్చు. గ్రామీప ప్రాంతాల్లో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉంటారు కాబట్టి.. మొబైల్, DTH రీఛార్జ్‌లు, కరెంట్ బిల్లులు, గ్యాస్ బుకింగ్, ఆన్‌లైన్ అప్లికేషన్లు వంటి సేవలను అందించడం ద్వారా మీరు వారికి హెల్ప్ చేయడంతో పాటు డబ్బులు కూడా సంపాధించుకోవచ్చు. ఈ బిజినెస్‌ కోసం మీకు కావలసిందల్లా స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్, సాంకేతిక పరిజ్ఞానం. మీ దగ్గర కంప్యూటర్,లేదా ల్యాప్‌టప్ ఉంటే ఇంకా బెటర్. గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి సేవలకు నిరంతరం డిమాండ్ ఉంటుంది.

3 / 5
బ్యాగుల తయారీ వ్యాపారం: రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం నేపథ్యంలో ప్లాస్టిక్ వాడకంపై ఆంక్షలు పెరుగుతున్నాయి. ఈ సందర్భంలో, పేపర్ కవర్లు, క్లాత్ బ్యాగులు, క్లాత్ బ్యాగులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. మీరు ఇంటి దగ్గరే ఈ పేపర్ బ్యాగ్స్‌ తయారీ బిజినెస్‌ పెట్టుకుంటే భారీ లాభాలను పొందవచ్చు. ఈ వ్యాపారాన్ని పేపర్, క్లాత్, కటింగ్-స్టిచింగ్ వంటి చిన్న ఖర్చులతో ప్రారంభించవచ్చు. మీరు రూ. 7,000 నుండి 10,000 పెట్టుబడితో ప్రారంభించవచ్చు. మీరు స్థానిక దుకాణాలు, మార్కెట్లకు మీ ఉత్పత్తులను సరఫరా చేయవచ్చు.

4 / 5
తోటలో కూరగాయల పెంపకం: మీకు ఇంట్లో ఎక్కువ స్థలం ఉంటే, దానిలో చిన్న తరహా కూరగాయలు పండించడం మంచి ఎంపిక. మీరు మార్కెట్‌లో బాగా డిమాండ్ కూరగాయల గురించి తెలుసుకొని. వాటి మీ ఇంట్లో కుండలలో పెంచవచ్చు. ఇందుకోసం మీకు కావలసిందల్లా.. ఇంటి పెరట్లో కాస్తా ఖాళీ ప్లేస్, విత్తనాలు, కుండలు, ఎరువులు, నీటి లభ్యత. మీరు పండించిన కూరగాయలను ఇంట్లోకి వాడుకోవడంతో పాటు మార్కెట్‌లో కూడా అమ్ముకోవచ్చు.

5 / 5
తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం: ఈ వ్యాపారాలన్నింటినీ ఎక్కువ రిస్క్ లేకుండా ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. వీటిని మీరు చిన్నగా ప్రారంభించి క్రమంగా విస్తరించవచ్చు. ముఖ్యంగా సెకండ్ ఇన్‌కమ్, స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఈ బిజినెస్‌లు మంచి ఎంపిక (Note: ఈ వ్యాసంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడింది. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు లేదా ఏదైనా ఆర్థిక రిస్క్ తీసుకునే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు)