Shiva Prajapati |
May 12, 2021 | 2:53 PM
తెలంగాణలో లాక్‌డౌన్‌ను పోలీసు అధికారులు పక్కాగా అమలు చేస్తున్నారు. ఉదయం 10 గంటలు దాటిన తరువాత అన్నీ మూసివేసేలా చర్యలు తీసుకుంటున్నారు. జనాలు బయట తిరగకుండా వార్నింగ్ ఇస్తున్నారు.
లాక్‌డౌన్ నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో దుకాణాలు మూతపడ్డాయి. ఇతర కార్యకలాపాలు నిలిచిపోయాయి.
లాక్‌డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్లు, బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు నిర్మానుష్యంగా మారాయి.
హైదరాబాద్‌లోని అమీర్‌పేట, పంజాగుట్ట, ఎస్‌ఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో వస్త్ర, వాణిజ్య, దుకాణ సముదాయాలను వ్యాపారులు మూసివేశారు.
లాక్‌డౌన్ నిబంధనలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రధాన కూడళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన అత్యవసర సేవలను మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారిని వెనక్కి పంపుతున్నారు.