
ప్రస్తుతం ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ చూసిన జబర్దస్త్ ఫేమ్ డేగల బాబు పేరు బాగా వినబడుతోంది. ఎందుకంటే, తను డైరెక్ట్ చేసిన లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వెబ్ సిరీస్ రిలీజైన రోజు నుంచి ట్రెండింగ్ లో ఉంది. అంతేకాదు , తన తొలి వెబ్ సిరీస్ తో కొత్త సెన్సేషన్ సృష్టించాడు. ఇంతవరకు ఎవరికి లేని రెండు రికార్డ్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.

వెబ్ సిరీస్ లు ఎక్కువగా ఓటిటీలోనే రిలీజ్ అవుతాయి. అది కూడా ఏదైనా ఒకదానిలో విడులవుతుంది. అయితే, డైరెక్టర్ డేగల బాబు దర్శకత్వం వహించిన లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఏకంగా రెండు ఓటిటీ ప్లేట్ ఫార్మ్స్ లో రిలీజ్ అయింది. ఈటీవీ విన్ తో పాటు, నెట్ ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమ్ అవుతుంది.

వైవా హర్ష మెయిన్ లీడ్ కాగా , ఐశ్వర్య హోలక్కల్ కథానాయికగా నటించగా.. జబర్దస్త్ స్టార్ కమెడియన్ హైపర్ ఆది, జీవన్, శ్రీ విద్య, రూప శ్రావ్య, వాసు ఇంటూరి, జబర్దస్త్ గోపి తదితర నటి నటులు నటించారు. ఎవరు ఊహించని విధంగా లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వెబ్ సిరీస్ ఐదు భాషలలో అందుబాటులో ఉంది. ఇలా తన తొలి వెబ్ సిరీస్ తెలుగుతో పాటు హిందీ, తమిళం కన్నడ, మలయాళంలో కూడా స్ట్రీమ్ అవుతుండటంతో కొత్త రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు.

అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో రెండు ప్లాట్ ఫార్మ్స్ లో కూడా ట్రెండింగ్ లో నిలిచింది. ఆడియెన్స్ నుంచి ఒకటే మాట డైరెక్టర్ డేగల బాబు కామెడీనే కాదు ఎమోషనల్ సీన్స్ కూడా బాగా హ్యాండిల్ చేయగలడని నిరూపించుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి డైరెక్టర్ డేగల బాబు లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో ప్రేక్షకులను నవ్వించాడు చివర్లో ఏడిపించేశాడు. క్లైమాక్స్ లో వైవా హర్ష, ఐశ్వర్య మధ్య జరిగిన ఎమోషనల్ సీన్స్ గుండెల్ని పిండేశాయి. ఇక కామెడీ విషయానికొస్తే హైపర్ ఆది, శ్రీ విద్య కామెడీ బాగా పేలింది. ఇలా తన తొలి వెబ్ సిరీస్ తో రెండు రికార్డ్స్ క్రియోట్ చేశాయి.