Laptop Buying Tips: కొత్త ల్యాప్‌టాప్ కొనాలని భావిస్తున్నారా? ముందుగా ఈ 4 విషయాలను చెక్ చేసుకోండి..

|

Mar 31, 2023 | 7:17 AM

మీరు కొత్త ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? ల్యాప్‌టాప్‌ను కొనే ముందు కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలి.

1 / 6
ప్రస్తుత కాలంలో ల్యాప్‌టాప్ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. చిన్న పిల్లల ఆన్‌లైన్ తరగతుల నుండి అన్ని వయసుల వారు ల్యాప్‌టాప్‌లను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

2 / 6
మీరు కొత్త ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ముందుగా తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అనేక విభిన్న బ్రాండ్‌లు, ప్రాసెసర్, స్క్రీన్ పరిమాణాలు, బరువులు పరిగణనలోకి తీసుకోవాలి. మీ అవసరాలకు తగిన ల్యాప్‌టాప్‌ను ఎంచుకోవాలి.

3 / 6
ప్రాసెసర్/ CPU: ప్రాసెసర్ లేదా CPU కంప్యూటర్ పవర్‌హౌస్. ఇది ప్రోగ్రామ్‌లను అమలు చేయడానికి అవసరమైన అన్ని గణనలను నిర్వహిస్తుంది. మీ ల్యాప్‌టాప్ చేసే ప్రతి పనిని కంట్రోల్ చేస్తుంది. అందుకే సరైన ప్రాసెసర్, CPU ని చూసుకోవాలి.

4 / 6
మీ అవసరం ఏంటో నిర్ధారించుకోవాలి: ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాన్ని కొనుగోలు చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం మీ అవసరాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవడం. మీకు కొత్త ల్యాప్‌టాప్ ఎందుకు అవసరమో, రోజూ ఎంత సమయం వినియోగిస్తారు, మీ బడ్జెట్ ఎంత అనేది తెలుసుకోవాలి. ఇలా చేయడం వలన మీకు అవసరమైన ల్యాప్‌టాప్ కొనుగోలు చేయగలుగుతారు.

5 / 6
ల్యాప్‌టాప్ పరిమాణం: ల్యాప్‌టాప్‌లు వివిధ పరిమాణాలలో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా పిల్లల కోసం ల్యాప్‌టాప్ కొంటున్నప్పుడు తక్కువ బరువున్న ల్యాప్‌టాప్‌నే కొనండి. బరువైన ల్యాప్‌టాప్ తీసుకువెళ్లడం కష్టం. వారి వెన్ను సమస్యలకు కారణం కావచ్చు.

6 / 6
బ్యాటరీ లైఫ్: ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారికి, పని చేసే వారికి చాలా కాలం పాటు బ్యాటరీ లైఫ్ ఉండే ల్యాప్‌టాప్ అవసరం. అందుకే ల్యాప్‌టాప్ కొనే ముందు గుర్తుంచుకోవలసిన మరో విషయం ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్. మీ ల్యాప్‌టాప్‌ను ఛార్జ్ చేయడానికి వర్కింగ్ ప్లగ్ పాయింట్‌ను ఎల్లప్పుడూ అందుబాటులో ఉండకపోవచ్చు. పెద్ద ఛార్జర్‌ని తీసుకెళ్లడం కూడా ఎల్లప్పుడూ సాధ్యం కాదు. అందుకే మీ ల్యాప్‌టాప్ సుదీర్ఘ బ్యాటరీ లైఫ్‌ని కలిగి ఉండటం చాలా అవసరం.