
గుమ్మడి గింజలు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వివిధ రకాల యాంటీఆక్సిడెంట్స్, క్యాల్షియం, ఐరన్, ప్రొటీన్, పొటాషియం, పాస్పరస్, విటమిన్ ఎ, బి, సి, డి, బి12 వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. గుమ్మడి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని పీచు పదార్థం గుండెకు రక్తప్రసరణ సక్రమంగా సాగేలా చూస్తుంది.

Pumpkin Seeds

pumpkin seeds

ఇక పిల్లలకు చాలా తక్కువగా అందివ్వాలి. లేకుంటే.. కడుపునొప్పి, విరేచనాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి, పిల్లలతోపాటు పెద్దలు కూడా.. గుమ్మడి గింజలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. గుమ్మడి గింజలను మితంగా తినడం మంచిది. స్మూతీలు, సలాడ్లలో గుమ్మడి గింజలు కలిపి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.

గుమ్మడి గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అధిక బరువుతో బాధపడేవారు గుమ్మడి గింజలు తింటే.. మేలు జరుగుతుంది. గుమ్మడి గింజల్లోని కెరొటినాయిడ్లు, విటమిన్ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి.