
గుడ్డు పచ్చసొనలో ప్రోటీన్, కొవ్వు, విటమిన్ A, B12, D, E, ఐరన్, కాపర్, జింక్, మెగ్నీషియం వంటి ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు ఉంటాయి. పచ్చసొన తినడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది, మెదడు అభివృద్ధికి తోడ్పడుతుంది, అలసటను తగ్గిస్తుంది, ఎముకలకు విటమిన్ D లభిస్తుంది.

గుడ్డు పచ్చసొన తినడం మానుకోవడానికి ప్రధాన కారణం అందులో అధిక కొలెస్ట్రాల్ ఉండటం. కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు. కాలేయం సమస్య ఉన్నవారు కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి డాక్టర్ సలహా మేరకు పచ్చసొన ను తీసుకోవాలి.

గుడ్డులోని తెల్లసొనలో ప్రొటీన్లు, విటమిన్ బి2 ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. కానీ గుడ్డు పచ్చసొనలోనూ వివిధ విటమిన్లు, ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా అవసరం. గుడ్డు పచ్చసొనలో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ కె, ఒమేగా 3 వంటి విటమిన్లు ఉన్నాయి. ఈ పోషకాలు మనలో రోగనిరోధక శక్తిని రెట్టింపు చేస్తాయి.

గుడ్డు పచ్చసొన తినటం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్, కొవ్వు స్థాయిలు పెరుగుతాయని చాలా మంది అపోహపడుతుంటారు. కానీ, గుడ్డులో సహజమైన, ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా కొలెస్ట్రాల్ స్థాయి పెరిగే ప్రమాదం ఉండదని చెబుతున్నారు..

గుడ్డులోని పచ్చసొనలో సెలినియమ్ అధికంగా ఉంటుంది. ఇది జుట్టు, గోళ్ల ఆరోగ్యాని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. సెలీనియం థైరాయిడ్‌కు కూడా మేలు చేస్తుంది. అలాగే, గుడ్డులోని తెల్లసొనలో తక్కువ కేలరీలు, కొవ్వు కలిగి ఉండగా, పచ్చసొనలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. మొత్తం గుడ్డు తింటేనే అన్ని పోషకాలు పొందవచ్చు.