తుమ్ములు అనారోగ్యం బారిన పడకుండా చేస్తుంది: తుమ్ము అనేది నిజానికి శరీరంలోకి ప్రవేశించిన బ్యాక్టీరియా, దుమ్ము, ధూళి, పుప్పొడి, పొగ, కాలుష్యం మొదలైన వాటి వల్ల కలిగే ప్రతిచర్య. దీని కారణంగా మీరు మీ ముక్కు దగ్గర కొద్దిగా తిమ్మిరి, అసౌకర్యంగా భావిస్తారు. అలాంటప్పుడు మీరు తుమ్ముతారు. ఈ చర్య అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు. క్రిములు, కణాల వల్ల శరీరం దెబ్బతినకుండా తుమ్ములు కాపాడతాయని చెప్పారు. తుమ్మును ఆపడం అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని, కొన్నిసార్లు ప్రమాదకరంగా కూడా మారుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.