
హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం వంటగది కేవలం ఆహారం తయారుచేసే చోటు మాత్రమే కాదు అది సాక్షాత్తూ అన్నపూర్ణ దేవి నివాసం ఉండే పవిత్ర స్థలం. వంటగదిలో వాస్తు దోషాలు ఉంటే ఆ ప్రభావం కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితిపై పడుతుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అగ్ని మూలకానికి చిహ్నమైన గ్యాస్ స్టవ్, సిలిండర్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.

ఏ దిశలో ఉంచడం శుభప్రదం: వాస్తు శాస్త్రం ప్రకారం.. అగ్ని మూలకానికి సంబంధించిన వస్తువులను ఎప్పుడూ ఆగ్నేయ దిశలో ఉంచడం అత్యంత శుభప్రదం. ఈ దిశలో గ్యాస్ సిలిండర్ ఉంచడం వల్ల ఇంట్లో శక్తి సమతుల్యత ఉంటుంది. ఒకవేళ ఆగ్నేయ దిశలో వీలు పడకపోతే, తూర్పు దిశలో కూడా గ్యాస్ స్టవ్ ఉంచుకోవచ్చు.

వాస్తు నిపుణులు చెప్పిన దాని ప్రకారం.. గ్యాస్ సిలిండర్, స్టవ్ పెట్టడానికి ఆగ్నేయం చాలా మంచిది ఇలా పెట్టడం వలన ప్రతికూల శక్తులు తొలిగి లక్ష్మి దేవి ప్రవేస్తుంది. అలాగే, అదృష్టం కూడా వస్తుంది. కాబట్టి, మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ స్థానాన్ని మార్చండి.

ఆరోగ్యం - పరిశుభ్రత: గ్యాస్ స్టవ్ ఉన్న ప్రదేశం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. అపరిశుభ్రత వల్ల ప్రతికూల శక్తి పెరుగుతుంది. ఇది కేవలం వాస్తు దోషమే కాకుండా, ఇంట్లోని వారి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి వంట పూర్తయిన తర్వాత స్టవ్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం.

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువుళ్లు కూడా మన జీవితంపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. అవి పాజిటివ్ గా ఉంటాయి లేదంటే నెగిటివ్ గా ఉంటాయి. కాబట్టి, మీ ఇంట్లో సిలిండర్ ను సరైన దిశలో పెట్టాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.