Kishan Reddy: కేబినెట్ భేటీకి దూరంగా ఉన్న కిషన్ రెడ్డి.. కేంద్రమంత్రికి రాజీనామ చేసినట్లేనా ?

|

Jul 05, 2023 | 1:15 PM

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియామకం అయిన కిషన్ రెడ్డి తాజాగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామ చేసినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం పది గంటలకు కేంద్ర మంత్రిమండలి సమావేశం ప్రారంభమైంది. అయితే కిషన్ రెడ్డి మాత్రం ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. ఆయన ఢిల్లీలో ఉన్నప్పటికీ కూడా ఆ సమావేశానికి హాజరుకాలేదు.

1 / 6
 తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియామకం అయిన కిషన్ రెడ్డి తాజాగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామ చేసినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం 10.00 AM గంటలకు కేంద్ర మంత్రిమండలి సమావేశం ప్రారంభమైంది. అయితే కిషన్ రెడ్డి మాత్రం ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. ఆయన ఢిల్లీలో ఉన్నప్పటికీ కూడా ఆ సమావేశానికి హాజరుకాలేదు.

2 / 6
 పరిస్థితులు చూస్తుంటే ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామ చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం ఆయన 2021 నుంచి కేంద్ర పర్యాటకశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే 2019 నుంచి 2021 వరకు హోం వ్యవహారాల సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ చేస్తామని కేంద్రం ప్రకటించిందిన విషయం తెలిసిందే. ఈ విస్తరణ జరగకముందు కిషన్ రెడ్డి తన నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించవచ్చు.

3 / 6
బీజేపీ అధిష్ఠానం రాష్ట్రాల అధ్యక్షులను మారుస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌‌గా ఎమ్మెల్యే ఈటల రాజేంధర్‌కు హైకమాండ్ బాధ్యతలు అప్పగించింది. అలాగే బండి సంజయ్‌కు కేంద్ర సహాయ మంత్రిగా పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.

4 / 6
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై కిషన్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పటిదాకా లేని ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ పదవిని ఈ సమయంలో ఎందుకు తెచ్చారని.. పూర్తి స్థాయిలో అధికారం ఇవ్వకుండా బాధ్యతలు అనేవి ఎలా ఉంటాయనే భావన కిషన్ రెడ్డిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే కిషన్ రెడ్డికి ఈటల రాజేందర్ పోటీదారుడిగా ఉన్నట్లే కనిపిస్తోంది

5 / 6
 తెలంగాణలో డిసెంబర్‌లో ఎన్నికల జరగే అవకాశం ఉంది. అయితే ఇప్పటిదాక చాలా నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులుగా ఎవరిని నిలబెడతారో తెలియని పరిస్థితి నెలకొంది. బండి సంజయ్ కొందిరికి హామీ ఇచ్చినప్పటికి అది ఎంతవరకు సాధ్యమవుతుందనేది ప్రశ్నార్థకంగానే ఉంది. అభ్యర్థుల విషయంలో పార్టీ అధిష్ఠానం ఎవరిపై ఆధారపడనుందనే విషయంలో ఆసక్తి నెలకొంది.

6 / 6
 ఇతర పార్టీల నుంచి కొంతమందిని బీజేపీలోకి లాగాలని ఈటల రాజేందర్ చూస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌లో సంతృప్తిగా లేని నాయకుల్ని తమవైపు తీసుకొస్తే పార్టీకి ప్రయోజనం ఉంటుందని ఈటల భావిస్తున్నట్లుగా కనబడుతోంది. ఇక ఇన్నిరోజులు పార్టీ కోసం పనిచేసిన పార్టీ నేతలు కిషన్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.