ఎట్టకేలకు మేడారంలో జువ్వి చెట్టు.. దశాబ్దాల చరిత్రకు ప్రతీక..! 20 ఏళ్ల వృక్షాన్ని ఎలా నాటరంటే..

Edited By:

Updated on: Aug 08, 2026 | 8:17 AM

కోట్లాది మంది భక్తుల ఇలవేల్పులైన మేడారం సమ్మక్క-సారలమ్మ దేవతల గద్దెల ప్రాంగణం మాస్టర్ ప్లాన్ నిర్మాణంలో భాగంగా నూతన రూపు దిద్దుకుంటోంది. ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని సకల సౌకర్యాలతో ఆధునికీకరిస్తున్నప్పటికీ, ఆదివాసీల ఆచార వ్యవహారాలు, ప్రకృతి ఆరాధనా సంప్రదాయాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా సమ్మక్క గద్దె పక్కనే నాగులమ్మ ఆలయం వద్ద దశాబ్దాల తరబడి నిలిచిన పవిత్ర జువ్వి చెట్టును ట్రీ ట్రాన్స్‌ప్లాంటేషన్ పద్ధతి ద్వారా తిరిగి ప్రతిష్టించారు.

1 / 5
మాస్టర్ ప్లాన్ నిర్మాణంలో బాగంగా కొత్తరూపు దిద్దుకున్న మేడారం గద్దెల ప్రాంగణంలో ఎట్టకేలకు జువ్వి చెట్టు ప్రతిష్టాపన పూర్తయింది.. సమ్మక్క గద్దె పక్కనే నాగులమ్మ ఆలయం వద్ద దశాబ్దాల తరబడి అమ్మలకు నీడనిస్తున్న జువ్వి చెట్టు.. 2010లో పూర్తిగా ఎండిపోయింది.. ఆ తర్వాత అనేకసార్లు ప్రతిష్టాపించిన ఆ చెట్టు నిలవడం లేదు.. తాజాగా 20 ఏళ్ల వయసు కలిగిన జువ్వి చెట్టును కారడవి నుండి వెతికి తీసుకొచ్చి ట్రాన్స్ ప్లాంటేషన్ చేసి ప్రతిష్టించడం ద్వారా సమ్మక్క సారక్క పూజారులు హర్షం వ్యక్తం చేశారు..

2 / 5
కోట్లాది భక్తుల నమ్మకానికి ప్రతిరూపం.. మేడారం సమ్మక్క సారక్క దేవతలు కొలువుతీరిన గద్దెల ప్రాంగణం మాస్టర్ ప్లాన్ లో భాగంగా కొత్త రూపు దిద్దుకుంది.. మేడారం ఆధ్యాత్మిక కేంద్రంగా, మినీ పట్టణంగా రూపాంతరం చెందుతుంది. గద్దెల ప్రాంగణాన్ని పూర్తిగా గ్రానైట్ నిర్మాణాలతో ఆధునికరించారు. సమ్మక్క సారక్క గద్దెలతో పాటు వరుస క్రమంలో పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల నిర్మాణం చేపట్టారు.. అయితే ఆదివాసీల ఆచార సాంప్రదాయాల ప్రకారం ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతి సంపదను పూజించడం ఆనవాయితీ... ఇలాంటి విగ్రహ రూపంలేని మేడారం గద్దెల ప్రాంగణంలో సమ్మక్క గద్ద పక్కనే నాగులమ్మ గద్దె ఉంటుంది.. అక్కడే తరతరాలుగా జువ్వి చెట్టు ఈ చల్లని తల్లులకు నీడనిస్తూ వస్తుంది..

3 / 5
అయితే సమ్మక్క సారక్క జాతరకు భక్తుల తాకిడి పెరిగినా కొద్దీ ఆ జువ్విచెట్టు ఆయుష్షు తిరిగిపోయింది..జువ్విచెట్టు వద్ద పూజలు నిర్వహించడం, బెరడును చాలామంది అక్కడి నుంచి తెంచుకుపోవడంతో కాలక్రమేనా ఈ భారీవృక్షం ఎండిపోయింది.  ఆ తర్వాత అనేకసార్లు జువ్విచెట్టు మొక్కను అక్కడ ప్రతిష్టించి పెంచడం కోసం ఆదివాసి పూజారులు ప్రయత్నాలు చేశారు కానీ ఫలితం దక్కలేదు..

4 / 5
తాజాగా గత జాతర సమయంలో మేడారం గద్దెల ప్రాంగణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆధునీకరించింది..ఆదివాసి పూజార్ల సూచనల మేరకు గద్దెల ప్రాంగణంలో జువి చెట్టు నిర్మాణం కోసం ప్రయత్నాలు చేశారు.. కానీ గతంలో అనేక సందర్భాలలో మొక్కలు నాటినా బ్రతకలేదు.. దీంతో ప్రాంతంలో జువ్వి వృక్షాన్ని ట్రీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని దేవాదాయశాఖ అధికారులు నిర్ణయించారు... మేడారం అడవుల్లో వెతికి నభారీ వృక్షాన్ని సేకరించి జేసీబీ సహాయంతో గద్దెల ప్రాంగణానికి తరలించారు..ఆదివాసి పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జెసిబి సహాయంతో ఇక్కడ జువ్వి చెట్టును ప్రతిష్టించారు..

5 / 5
జువ్వి చెట్టు ప్రతిష్టాపన సందర్భంగా సమ్మక్క సారక్క పూజాలతో పాటు నాగులమ్మ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఆదివాసి ఆచార సంప్రదాయాల ప్రకారం జుమ్మిచెట్టు ప్రతిష్టాపించిన ప్రభుత్వానికి స్థానిక మంత్రి సీతక్కకు ఆదివాసీ పూజారుల కృతజ్ఞతలు తెలిపారు..

Loading...
Unable to load recommendations.
Follow Us