జున్నుపాలు లేకుండా ఇంట్లో అప్పటికప్పుడు హెల్దీ జున్ను ఇలా చేసేయండి

Updated on: Oct 24, 2026 | 9:59 PM

జున్ను పాలు లేకుండా ఇంట్లోనే అప్పటికప్పుడు రుచికరమైన, గడ్డలాంటి జున్నును సులభంగా తయారు చేసుకోండి. ఇన్‌స్టంట్ జున్ను పౌడర్, సరైన కొలతలతో చేస్తే సంప్రదాయ ఆంధ్రా.. తెలంగాణ జున్ను రుచి . ఈ రెసిపీ జ్యూసీగా, మెత్తగా ఉండే జున్నును కూడా ఇది అందిస్తుంది.

1 / 5

2 / 5
ముందుగా ఒక గిన్నెలో తురిమిన బెల్లం, పచ్చి పాలను తీసుకోండి. గరిటెతో బాగా కలిపి బెల్లాన్ని పాలలో పూర్తిగా కరిగేలా చూసుకోండి. కొద్దిసేపు నానబెడితే బెల్లం సులభంగా కరిగిపోతుంది.బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత, అదే పాలలో పావు కప్పు జున్ను పౌడర్‌ను వేసి, విస్కర్ సహాయంతో ఉండలు లేకుండా బాగా కలపండి. ఇది పాలలో పూర్తిగా కలిసిపోయేలా చూసుకోండి.

3 / 5
మీరు జున్ను ఉడికించాలనుకుంటున్న గిన్నె లోపల అడుగున అంచుల వెంబడి నెయ్యిని బాగా రాయండి. ఇలా చేయడం వల్ల జున్ను డీమోల్డ్ చేసేటప్పుడు సులభంగా బయటకు వస్తుంది, విరిగిపోకుండా ఉంటుంది. జున్ను మిశ్రమాన్ని నెయ్యి రాసిన గిన్నెలోకి ఫిల్టర్ సహాయంతో వడకట్టండి. ఇది బెల్లంలో ఏమైనా మలినాలు ఉంటే వాటిని తొలగిస్తుంది.వడకట్టిన పాల మిశ్రమంలో ఉప్పు, యాలకుల పొడి ,  మిరియాల పొడిని వేసి బాగా కలపండి. మిరియాల పొడిని జున్నులో ఎందుకు కలుపుతారంటే, ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, అజీర్తిని నివారిస్తుంది. వాతం చేయకుండా కూడా సహాయపడుతుంది.ఈ గిన్నెపై మూత పెట్టి పక్కన ఉంచండి.

4 / 5
 స్టవ్ మీద ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసి, మధ్యలో ఒక స్టాండ్ పెట్టి, నీళ్లు మరుగుతున్నప్పుడు, సిద్ధం చేసుకున్న జున్ను గిన్నెను స్టాండ్ పై ఉంచండి. ఈ ప్రక్రియను మీరు ఇడ్లీ పాత్రలో కూడా చేయవచ్చు. మూత పెట్టి, మధ్యస్థ మంటపై కనీసం 30 నుండి 35 నిమిషాల పాటు ఆవిరిలో ఉడికించండి. 35 నిమిషాల తర్వాత, మూత తీసి ఒక కత్తిని జున్ను మధ్యలోకి గుచ్చి చూడండి. కత్తికి ఎలాంటి పాలు అంటుకోకుండా వస్తే, జున్ను పర్ఫెక్ట్‌గా ఉడికినట్లే. జున్ను ఉడికిన తర్వాత, గిన్నెను స్టవ్ మీద నుంచి తీసి పూర్తిగా చల్లారనివ్వండి. ఫ్యాన్ కింద లేదా నీళ్లలో పెట్టి బలవంతంగా చల్లబరచకుండా, దానికి అదే చల్లబడేలా వదిలేయండి. ఇది జున్ను గడ్డలా ఏర్పడటానికి సహాయపడుతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత, గిన్నెను ఫ్రిజ్‌లో 30 నిమిషాల నుండి ఒక గంట పాటు ఉంచండి.

5 / 5
ఫ్రిజ్ నుంచి బయటికి తీసిన తర్వాత, కత్తితో జున్ను అంచులను వదులు చేయండి. ఒక ప్లేట్‌ను గిన్నెపై పెట్టి వేస్తే, జున్ను సులభంగా బయటకు వస్తుంది. ఒకవేళ డీమోల్డ్ అవ్వకపోతే, గోరువెచ్చని నీటిలో గిన్నెను కొద్దిసేపు ఉంచి మళ్ళీ ప్రయత్నించండి.
ఈ సులభమైన చిట్కాలు మరియు కొలతలతో, మీరు జున్ను పాలు లేకపోయినా, ఇంట్లోనే సాఫ్ట్‌గా, జ్యూసీగా.. గడ్డలాంటి జున్నును తయారు చేసుకొని తినొచ్చు. ఇది సంప్రదాయ రుచిని కోల్పోకుండా, తక్షణమే ఇంట్లో తయారు చేసుకునే అద్భుతమైన తీపి వంటకం.

ఫ్రిజ్ నుంచి బయటికి తీసిన తర్వాత, కత్తితో జున్ను అంచులను వదులు చేయండి. ఒక ప్లేట్‌ను గిన్నెపై పెట్టి వేస్తే, జున్ను సులభంగా బయటకు వస్తుంది. ఒకవేళ డీమోల్డ్ అవ్వకపోతే, గోరువెచ్చని నీటిలో గిన్నెను కొద్దిసేపు ఉంచి మళ్ళీ ప్రయత్నించండి. ఈ సులభమైన చిట్కాలు మరియు కొలతలతో, మీరు జున్ను పాలు లేకపోయినా, ఇంట్లోనే సాఫ్ట్‌గా, జ్యూసీగా.. గడ్డలాంటి జున్నును తయారు చేసుకొని తినొచ్చు. ఇది సంప్రదాయ రుచిని కోల్పోకుండా, తక్షణమే ఇంట్లో తయారు చేసుకునే అద్భుతమైన తీపి వంటకం.

Loading...
Unable to load recommendations.
Follow Us