
ఊరగాయలు అసలు వద్దు: నేరేడు పండ్లు తిన్న వెంటనే లేదా వాటితో పాటు ఊరగాయలను అస్సలు ముట్టకూడదు. ఎందుకంటే ఊరగాయలు, నేరేడు పండ్లు రెండూ ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల కడుపులో యాసిడ్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. దీనివల్ల గుండెల్లో మంట, తీవ్రమైన ఎసిడిటీ లేదా యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఈ రెండింటికీ మధ్య కనీసం ఒక గంట వ్యవధి ఉండాలి.

పసుపుతో ప్రమాదం: పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, నేరేడు పండ్లతో దీని కాంబినేషన్ అస్సలు సెట్ కాదు. జామూన్ తిన్న వెంటనే పసుపు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కొంతమందిలో వికారం, కడుపులో తీవ్రమైన మంట, అసౌకర్యం కలగవచ్చు. ఈ రెండింటి రసాయన చర్యల వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది.

పాలు తాగడం మానుకోండి: చాలా మంది పండ్లు తినగానే పాలు తాగుతుంటారు. కానీ నేరేడు పండ్లు తిన్న వెంటనే పాలు తాగడం వల్ల జీర్ణక్రియ పూర్తిగా స్తంభించిపోతుంది. ఈ కాంబినేషన్ కడుపులో గ్యాస్, తీవ్రమైన కడుపు నొప్పి, ఉబ్బరానికి కారణమవుతుంది. నేరేడు పండ్లు తిన్న తర్వాత కనీసం 1 నుండి 2 గంటల వరకు పాలు గానీ, పాల పదార్థాలు గానీ తీసుకోకపోవడమే మంచిది.

స్వీట్లు, వేయించిన ఆహారాలు: నేరేడు పండ్లు చాలా వేగంగా జీర్ణమవుతాయి. కానీ అధిక తీపి పదార్థాలు, నూనెలో వేయించిన ఫుడ్స్ అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ రెండింటినీ కలిపి తింటే జీర్ణవ్యవస్థపై విపరీతమైన భారం పడుతుంది. ఫలితంగా కడుపు ఉబ్బరం, గ్యాస్, శరీరం బరువుగా అనిపించడం వంటి అసౌకర్యాలు తలెత్తుతాయి. స్వీట్లు తినాలనుకుంటే జామూన్ తిన్న రెండు గంటల తర్వాతే తినాలి.

తిన్న వెంటనే నీళ్లు తాగితే: నేరేడు పండ్లు తిన్న వెంటనే లీటర్ల కొద్దీ నీళ్లు తాగడం చాలా పెద్ద తప్పు. ఇలా చేయడం వల్ల కడుపులోని జీర్ణరసాల వేగం మందగించి, తిన్న పండ్లు సరిగ్గా అరగవు. దీనివల్ల అజీర్ణం, ఎసిడిటీ, కడుపులో అసౌకర్యం వస్తుంది. నేరేడు పండ్లు తిన్న తర్వాత కనీసం 30 నుండి 45 నిమిషాల వరకు నీళ్లు తాగకుండా ఉండటం ఉత్తమం. కాగా నేరేడు పండ్లను ఎప్పుడూ కూడా ఉదయం ఖాళీ కడుపుతో తినకూడదు. అలాగే మితంగా తిన్నప్పుడే ఈ సీజనల్ ఫ్రూట్ పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి.