వానాకాలంలో పెరుగు తింటే శరీరంలో ఏమవుతుంది? అసలు నిజాలు తెలుసుకోండి..

Updated on: Jul 27, 2026 | 8:05 AM

వర్షాకాలం రాగానే మన ఆహారపు అలవాట్లకు సంబంధించి అనేక రకాల సలహాలు, సూచనలు, ఆంక్షలు వినపడుతుంటాయి. "అది తినకూడదు, ఇది తింటే ఆరోగ్యానికి హానికరం" అంటూ దశాబ్దాలుగా వస్తున్న కొన్ని నియమాలను మనం ప్రశ్నించకుండానే గుడ్డిగా నమ్మేస్తుంటాం. కలిగిన పెరుగును వర్షాకాలంలో తింటే జలుబు, జ్వరం వస్తాయనేది ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఒక బలమైన నమ్మకం. మరి ఈ నమ్మకంలో ఎంతవరకు నిజముంది? అనేది తెలుసుకుందాం..

1 / 5
ఆయుర్వేద కోణంలో చూస్తే.. వర్షాకాలంలో పెరుగును నివారించాలని సూచిస్తుంటారు. ఈ కాలంలో శరీరంలో వాతం పెరగడం, పిత్తం పేరుకుపోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మందగించి పలు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ఆయుర్వేద సూత్రాలు చెబుతున్నాయి. ముంబైలోని జస్లోక్ హాస్పిటల్ చీఫ్ డైటీషియన్ డెల్నాజ్ టి. చందూవాడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఆయుర్వేదంలో చెప్పిన ఈ నియమాలు మనిషి శరీర తత్వాలు అయిన వాత, పిత్త, కఫ ప్రపత్తులను బట్టి రూపొందించారు. అయితే ఆధునిక మెడికల్ సైన్స్ దృక్పథం మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది.

2 / 5
ఆధునిక వైద్య విజ్ఞానం ప్రకారం.. గాలిలో తేమ, ఇన్ఫెక్షన్లు అత్యధికంగా ఉండే ఈ వర్షాకాలంలో మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవడం అత్యంత ముఖ్యం. పొట్టలోని మంచి బ్యాక్టీరియా పెరిగినప్పుడు మాత్రమే శరీరంలో రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఈ క్రమంలో పెరుగును ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో మేలు చేస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే వర్షాకాలంలో వాతావరణం వల్ల ఆహార పదార్థాలు త్వరగా పాడవుతాయి కాబట్టి పెరుగు తాజాగా ఉండేలా చూసుకోవడం, గడువు ముగిసిన లేదా పాడైపోయిన పెరుగును తీసుకోకుండా జాగ్రత్త పడటం ఎంతో అవసరం.

3 / 5
పెరుగు ఒక అద్భుతమైన ప్రోబయోటిక్ అని బెంగళూరు క్లౌడ్ నైన్ హాస్పిటల్స్ సీనియర్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అభిలాష వి వివరించారు. వర్షాకాలంలో పెరుగు తినకూడదనే పాత నమ్మకాలకు శాస్త్రీయ ఆధారం ఏమీ లేదని ఆమె స్పష్టం చేశారు. పెరుగులో సమృద్ధిగా ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థలో మేలు చేసే సూక్ష్మజీవులను పెంచి, పొట్టను బలంగా మారుస్తాయి. దీనివల్ల మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. కాబట్టి ఎటువంటి భయం లేకుండా ఈ సీజన్లో ఏవైనా కూరగాయలతో చేసిన రాయితా లేదా కొద్దిగా మిరియాల పొడి, అల్లం తురుము కలిపిన పలచటి మజ్జిగను నిరభ్యంతరంగా తీసుకోవచ్చని తెలిపారు.

4 / 5
విశేషమేమిటంటే.. గర్భిణీ స్త్రీలకు కూడా వర్షాకాలంలో పెరుగు ఎంతో మేలు చేస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో శరీరంలో ప్రొజెస్టిరాన్ హార్మోన్ స్థాయిలు పెరగడం వల్ల సాధారణంగా జీర్ణక్రియ మందగిస్తుంది. ఇలాంటి సమయంలో పెరుగు వంటి ప్రోబయోటిక్ ఆహారాన్ని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడటమే కాకుండా గర్భిణులను వేధించే మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

5 / 5
వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల జలుబు చేస్తుందనేది కేవలం ఒక అపోహ మాత్రమే. సరైన మోతాదులో, శుభ్రమైన, తాజా పెరుగును తీసుకోవడం వల్ల వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని మనం కాపాడుకోవడమే కాకుండా పొట్ట ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకోవచ్చు. కాబట్టి ఈ వర్షాకాలంలో ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా హాయిగా పెరుగును మీ ఆహారంలో భాగం చేసుకోండి.

Follow Us