
మన సౌంతిండియాలోని ఇళ్లలో వంకాయలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ కూర లేకుండా ఓ ఫంక్షన్లు, పండగలు జరగవు.. ఇంది టేస్ట్ విషయంలో నాన్‌వెజ్ వంటకాలతో కూడా పోటీ పడుతుంది. అందుకే చాలా మంది ఈ కర్రీని తినేందుకు ఇష్టపడతారు. ఇందులో కేలరీలు, కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఇది మంచిదే అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

వంకాయ - బ్లడ్ షుగర్: వంకాయలో ఫైబర్‌తో పాటు పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ జీర్ణక్రియను, కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదింపజేయడానికి సహాయపడుతుంది, దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నియంత్రణలో ఉంటాయి. అంతేకాదు వంకాయ తొక్క, గుజ్జులో డెల్ఫినిడిన్, క్లోరోజెనిక్ యాసిడ్ వంటి మొక్కల ఆధారిత సమ్మేళనాలు ఉంటాయి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

బ్లడ్ షుగర్‌పై ప్రభావం: వంకాయలోని కొన్ని సమ్మేళనాలు పిండి పదార్థాన్ని చక్కెరగా మార్చే ఎంజైమ్‌ల పనితీరును నెమ్మదిస్తాయని ల్యాబ్ పరిశోధనల్లో తేలింది. అయితే, మానవులపై దీని పూర్తి స్థాయి ప్రభావం ఇంకా స్పష్టంగా రుజువు కావాల్సి ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు కణాలపై ఆక్సీకరణ ఒత్తిడి పెరుగుతుంది. జంతువులపై జరిపిన అధ్యయనాల్లో వంకాయలోని యాంటీఆక్సిడెంట్లు ఈ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడినట్లు తేలింది.

గుండె ఆరోగ్యం: జంతువులపై చేసిన అధ్యయనాల ప్రకారం వంకాయలోని సమ్మేళనాలు రక్తపోటు, బరువును అదుపులో ఉంచడానికి మేలు చేస్తాయని తెలిసింది. అయితే మనుషులపై ఈ పరిశోధనలు పరిమితంగా ఉన్నాయి కాబట్టి కొలెస్ట్రాల్‌పై దీని ప్రభావం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కాబట్టి డయాబెటీస్ ఉన్న వారు వీటిని ఆహరంలో చేర్చుకునే ముందు కచ్చితంగా వైద్యుల సలహా తీసుఓండి.

ఆహారంలో ఎలా తీసుకోవడం మంచిది: వంకాయను తొక్కతో సహా గ్రిల్ చేసి, కాల్చి లేదా బేక్ చేసి తినడం మంచిది. ఇది నూనెను ఎక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి డీప్ ఫ్రై చేయకపోవడమే బెస్ట్ ఆఫ్షన్. తక్కువ నూనెతో వండుకోవడం ఎల్లప్పుడూ ఉత్తమం. అయితే ఇది పూర్తిగా మీ డయాబెటీస్‌ను తగ్గించలేదు.. మొదట మీరు వైద్యుడి సూంచిన ముందులు వాడుతూ.. తర్వాత మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలో వద్దో వైద్యులను సంప్రదించి తెలుసుకోండి. Note: వీటిని Tv9 దృవీకరించడం లేదు)