
విటమిన్ B12 లోపిస్తే మన శరీరం మన మాట వినదు. ఈ విటమిన్ B12 లోపిస్తే రక్తహీనత, నాడీ వ్యవస్థ దెబ్బతినడం వంటివి వస్తాయి. ఇది మాత్రమే కాకుండా మెదడు సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి, మీ ఆహారంలో కొన్ని చేర్చుకుంటే ఆ సమస్యలు తగ్గుతాయి. అవేంటి ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

ఇది శరీరంలో ఒకసారి లోపిస్తే ఎర్ర రక్తకణాలు కూడా ఉత్పత్తి కాలేవు ఇంకా ఇవి తయారవ్వకపోవడం ఆగిపోతే ఒంట్లో అలసట, బలహీనత, చర్మం కూడా పసుపు రంగులోకి మారుతుంది. ఇంకా మానసిక సమస్యలు కూడా పెరుగుతాయి. డిప్రెషన్, జ్ఞాపకశక్తి తగ్గడం, చిరాకు వంటివి కూడా ఇంకా ఎక్కువవుతాయి.

ఇది తగ్గించడం కోసం నల్ల ఎండు ద్రాక్ష మంచిగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే దీనిలో ఐరన్, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, కాపర్, ఫైబర్ వంటి ముఖ్య పోషకాలు దీనిలో ఉంటాయి. అయితే, మీరు రోజూ లెక్కపెట్టి 10 నీటిలో నానబెట్టి ఉదయం తింటే మీకున్న సమస్యలు మొత్తం పోతాయి.

ఈ నల్ల ఎండు ద్రాక్షతో పాటు మీ రోజూ వారి ఆహారంలో పాలు, పెరుగు, గుడ్లు, చేపలు వంటిలో ఇది దొరుకుతుంది. వీటి వలన కూడా పోషక విలువలను మీరు నేచురల్ గా పెంచుకోవచ్చు. ఇంకా మీ జీర్ణక్రియ పనితీరును కూడా ఇది మెరుగుపరుస్తుంది. B12 సప్లిమెంట్లు దొరికే ఫుడ్ తీసుకున్నా చాలు.

(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)