సమ్మర్‌లో తీర్థ యాత్రలకు వెళ్ళే వారికి గుడ్‌న్యూస్.. సరికొత్త ప్యాకేజీలతో రైల్వే శాఖ స్పెషల్ అఫర్

Edited By:

Updated on: Apr 09, 2026 | 7:34 PM

సమ్మర్ సీజన్‌లో పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే ప్రయాణికులకు భారత రైల్వేస్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాల భక్తుల కోసం ప్రత్యేకంగా భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఏప్రిల్ 14 నుండి జూన్ 12 మధ్య సికింద్రాబాద్ (హైదరాబాద్) నుండి ప్రారంభమయ్యే 4 ప్రత్యేక ప్యాకేజీల వివరాలను IRCTC జాయింట్ జనరల్ మేనేజర్ డి.ఎస్.జి.పి. కిషోర్ వెల్లడించారు. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం

1 / 5
అయోధ్య-కాశీ: బైద్యనాథ్ ధామ్ దర్శన్ యాత్ర:  ఈ యాత్రలో పూరి, కోణార్క్, బైద్యనాథ్ ధామ్, వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్ వంటి క్షేత్రాలను సందర్శించవచ్చు. ఈ యాత్ర ఏప్రిల్ 28వ తేదీన ప్రారంభమై మే 7 వ తేదీ వరకు ఉంటుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర 16,700 ఉంటుంది.  థర్డ్ ఏసీ అయితే రూ. 26,100, 2 ఏసీ రూ. 34,100 వరకు ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్ నుంచి ప్రారంభమై కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని,దువ్వాడ, పెందుర్తి, విజయనగరం మీదుగా వెళ్తుంది.

2 / 5
హరిద్వార్-మాతా వైష్ణోదేవి- రిషికేష్-యాత్ర (SCZBG57): ఈ యాత్రలో మధుర, బృందావనం, మాతా వైష్ణోదేవి, హరిద్వార్, రిషికేశ్ వంటి పుణ్యధామాలను దర్శంచుకోవచ్చు. ఈ యాత్ర మే 12వ తేదీన ప్రరంభమై మే 21వ తేదీ వరకు ఉంటుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర 16,500గా ఉండగా 3 ఏసీ ధర రూ.25,700, 2 ఏసీ ధర రూ. 33,400గా ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్ ప్రారంభమై భువనగిరి, జనగాం, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల్ , బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బల్హర్ష, వార్తా , నాగ్పూర్ మీదుగా వెళ్తుంది.

3 / 5
అరుణాచలం - చిదంబరంతో దివ్య దక్షిణ యాత్ర (SCZBG58): ఈ యాత్రలో దక్షిణ భారతంలోని ప్రముఖ క్షేత్రాలైన తిరువణ్ణామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రిచి, తంజావూరు, చిదంబరం క్షేత్రాలను సందర్శించవచ్చు. ఈ యాత్ర మే 24 వ తేదీన ప్రారంభమై మే 31 వ తేదీ వరకు ఉంటుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర 14,500గా ఉండగా 3 ఏసీ ధర రూ. 21,700, 2 ఏసీ ధర రూ. 27,900 ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్ ప్రారంభమై జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా వెళ్తుంది.

4 / 5
బైద్యనాథ్ ధామ్‌తో అయోధ్య కాశీ పుణ్య క్షేత్ర యాత్ర - యమునా నది పుష్కరాలు ప్రత్యేకం (SCZBG59): ఈ యాత్రలో పూరి, కోణార్క్, బైద్యనాథ్ ధామ్, వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్ సందర్శనతో పాటు యమునా పుష్కరాలను కూడా చూడవచ్చు. ఈ యాత్ర జూన్ 03 వ తేదీన ప్రారంభమై జూన్ 12 వ తేదీ వరకు ఉంటుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర 16,700, 3 ఏసీ ధర రూ. 26,100 , 2 ఏసీ ధర రూ. 34,100ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్ ప్రారంభమై కాజీపేట, వరంగల్, ఖమ్మం,  విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్,  తణుకు, నిడదవోలు, రాజమండ్రి,  సామర్లకోట, తుని, దువ్వాడ,  పెందుర్తి,  విజయనగరం మీదుగా వెళ్తుంది.

5 / 5
ఈ ప్యాకెజ్‌లో ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు ఉంటాయి.  రైలు ప్రయాణం, క్షేత్రాల వద్ద బస్సు సౌకర్యం. వసతి , అన్ని వేళల భోజనం, వాటర్ బాటిల్ సరఫరా. టూర్ ఎస్కార్ట్ సేవలు, ట్రావెల్ ఇన్సూరెన్స్. ప్రతి కోచ్‌కు ఒక సెక్యూరిటీ గార్డ్, రైలులో సీసీ కెమెరాల నిఘా ఉంటుంది.టికెట్ బుక్ చేసుకోవాలి అనుకునే వారు వివరాలకు 9701360701, 9281030727, 9281030759 లకు సంప్రదించాలని మరిన్ని వివరాలకు www.irctctourism.com వెబ్సైట్ ని సంప్రదించవచ్చు.

Follow Us