
కిరణ్ బేడి: కిరణ్ బేడి అనే పేరు వినగానే మనకు ఒక పవర్ఫుల్ ఆఫీసర్ గుర్తుకు వస్తారు. ఈమె ఒక రిటైర్డ్ భారతీయ పోలీసు అధికారిణి. 1972లో ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్ గా చేరి తొలి భారతీయ మహిళగా రికార్డ్ క్రియోట్ చేసారు. ఈమె 1994లో ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే అవార్డు కూడా పొందారు.

కల్పనా చావ్లా : ఇప్పటికీ కల్పనా చావ్లా గురించి మనం మాట్లాడుకుంటాము. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ మహిళ రికార్డ్ క్రియోట్ చేసింది. 1994లో నాసా ఆమెను ఎంపిక చేసింది. చావ్లా ఫిబ్రవరి 1, 2003న ప్రాణాలు విడిచింది.

మేరీ కోమ్ : పేదరికం నుంచి ప్రపంచ వేదిక వరకు వెళ్ళిన ఆమె ప్రయాణం అందరికి ఆదర్శం. ఒలింపిక్ పతక విజేతగా నిలిచిన మేరీ కోమ్ భారతదేశం గర్వపడేలా చేసింది.

పూసర్ల వెంకట సింధు ( పీవీ సింధు) భారతీయ బ్యాడ్మింటన్. ఒలింపిక్స్ లో వరుస పతకాలు సాధించిన తొలి భారతీయ తెలుగు మహిళ. 1995 జూలై 5న జన్మించిన సింధు, రియో ఒలింపిక్స్‌లో రజతం, టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం పతాకాన్ని సాధించింది.

మిథాలీ రాజ్ మన అందరికి సుపరిచితమే. ఈమె భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్. గ్రౌండ్ లోకి దిగితే సిక్స్, ఫోర్లతో మోత మోగిస్తోంది. తన క్రికెట్ కెరియర్లో 10,000 పైగా పరుగులు చేసిన రికార్డు క్రియోట్ చేసింది.