Lion Population 2025: దేశంలో గరిష్టంగా పెరిగిన మృగరాజుల సంఖ్య.. మొత్తం ఎన్ని ఉన్నాయంటే?

Updated on: May 22, 2025 | 12:48 PM

దేశంలో సింహాల జనాభా మూడో వంతుకు పైగా పెరిగినట్లు గుజరాత్ అటవీ శాఖ బుధవారం (మే 21, 2025) విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. తాజాగా దేశంలో సింహాల సంఖ్య 891కి చేరుకుందని తెలిపింది. 2020-25 మధ్య ఐదేళ్లలో దాదాపు 32 శాతం సింహాల జనాభా పెరిగినట్లు వెల్లడించింది. వీటిల్లో ఆడ సింహాల సంఖ్య 27 శాతం పెరిగి 330కి చేరుకున్నాయి..

1 / 5
భారతదేశంలో సింహాల జనాభా మూడో వంతుకు పైగా పెరిగినట్లు గుజరాత్ అటవీ శాఖ బుధవారం (మే 21, 2025) విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. తాజాగా దేశంలో సింహాల సంఖ్య 891కి చేరుకుందని తెలిపింది. 2020-25 మధ్య ఐదేళ్లలో దాదాపు 32 శాతం సింహాల జనాభా పెరిగినట్లు వెల్లడించింది. వీటిల్లో ఆడ సింహాల సంఖ్య 27 శాతం పెరిగి 330కి చేరుకున్నాయి.

2 / 5
గిర్ నేషనల్ పార్క్, పానియా వన్యప్రాణుల అభయారణ్యంలో గరిష్ట సంఖ్యలో 394 సింహాలు ఉన్నట్లు పేర్కొంది. 1995లో 304గా ఉన్న ఆసియా సింహాల జనాభా గత మూడు దశాబ్దాలుగా క్రమంగా పెరిగినట్లు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. 2020లో ఇవి 674గా ఉండగా, ఇప్పుడు అది 891కి పెరిగింది. అయితే ఇవి వాటి ఆఫ్రికన్ జాతి కంటే కొంచెం చిన్నవిగా ఉన్నట్లు పేర్కొన్నారు. వేట, ఆక్రమ రవాణా కారణంగా 1913 నాటికి వీటి జనాభా కేవలం 20కి పడిపోయింది. కానీ ఇప్పుడు గుజరాత్‌లోని విశాలమైన గిర్ వన్యప్రాణుల అభయారణ్యంలో ఇవి అధిక సంఖ్యలో కనిపిస్తున్నాయి. ఇక్కడ అవి పొడి ఆకురాల్చే అడవులు, బహిరంగ గడ్డి భూములలో స్వేచ్ఛగా తిరుగుతున్నాయని అన్నారు.

3 / 5
సంవత్సరాల తరబడి ప్రభుత్వ సమిష్టి ప్రయత్నాల ఫలితంగా, సింహాల జనాభా క్రమంగా పెరుగుతోంది. తాజా సింహాల జనాభా లెక్కింపు ప్రక్రియలో రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 35 వేల చదరపు కిలోమీటర్లు (13,513 చదరపు మైళ్ళు) విస్తరించింది. గుజరాత్‌ రాష్ట్ర వన్యప్రాణి బోర్డు మాజీ సభ్యుడు ప్రియవ్రత్ గధ్వి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన విజయవంతమైన పరిరక్షణ కార్యక్రమాల కారణంగా ఇది సాధ్యమైందని అన్నారు.

4 / 5
అలాగే అటవీ ప్రాంతాలకు సమీపంలో నివసించే స్థానిక ప్రజల మద్దతు కూడా మరొక కారణమని అన్నారు. వీరు సింహాల పరిరక్షణలో కీలకంగా సహాయపడ్డారని ఆయన అన్నారు. కానీ సంఖ్యలు పెరుగుతున్నప్పటికీ ఆసియా సింహాలు ఒకే చోట ఒకే జనాభా నుంచి ఉత్పన్నమయ్యే జన్యు సంతానోత్పత్తి ముప్పును ఎదుర్కొంటున్నాయని పరిరక్షణ సంస్థ WWF హెచ్చరిస్తోంది.

5 / 5
సింహాల జనాభా దేశానికే గర్వకారణం. ముఖ్యంగా గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలో మనుషులు, జంతువులు కలిసి జీవిస్తున్నారు. ఈ అభయారణ్యంలోని జంతువుల మధ్య పశువుల పెంపకం చేసే ఒక తెగ నివసిస్తుంది. ఈ ప్రాంతంలో సింహాలు హైవేను దాటేటప్పుడు రోడ్డుపై వాహనదారులు వేచి చూడటం సాధారణంగా కనిపించే దృష్యం. ఈ అభయారణ్యంలో కనిపించే చిరుతలు, పాంథర్లు, ఇతర పెద్ద పిల్లులతో పాటు సింహాలు కూడా ఉన్నాయి. దీంతో ఇది ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలిచింది.ప్రతి సంవత్సరం దాదాపు 5, 50,000 మంది పర్యాటకులు వన్యప్రాణుల ఉద్యానవనాన్ని సందర్శిస్తున్నారు. ఈ ఆసియా సింహాలు ప్రస్తుతం ఒకే ఉప జనాభాగా ఉన్నందున.. ఇవి తరచూ అడవి సంభవించే కార్చిచ్చుల కారణంగా అంతరించిపోయే ప్రమాదంలో పడుతున్నాయి.