
New Bank Rules: బ్యాంకింగ్ లావాదేవీల విషయంలో ఎన్నో నిబంధనలు మారుతున్నాయి. పాన్‌కార్డు, ఆధార్ కార్డు లేనిది పనులు జరగడం లేదు. పాన్ కార్డు ముఖ్యంగా బ్యాంకింగ్ పనులకు ఎంతో అవసరం. బ్యాంకు అకౌంట్ ఓపెన్ నుంచి లావాదేవీలు జరిపే వరకు పాన్ కార్డు తప్పనిసరి కావాల్సిందే

ఇక బ్యాంకులో కానీ.. పోస్టాఫీసులో నగదు లావాదేవీల నిర్వహణకు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కొత్త రూల్స్ ప్రకారం.. ఇక నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షలు కంటే ఎక్కువ మొత్తంలో బ్యాంకు, పోస్టాఫీసులో నగదు డిపాజిట్ చేస్తే ఆధార్, పాన్ కార్డు సమర్పించాల్సి ఉంటుంది.

ఆదాయం పన్ను చట్టం నిబంధనలు-2022 కింద కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఖరారు చేసింది. ఈ మేరకు సీబీడీటీ ఈనెల 10వ తేదీ నోటిఫికేషన్ జారీ చేసింది. 2022 మే 26 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకువస్తున్నట్లు సీబీడీటీ తెలిపింది.

ఏయే లావాదేవీలకు పాన్, ఆధార్ అవసరం.. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక బ్యాంకింగ్ కంపెనీ లేదా సహకార బ్యాంకు, పోస్టాఫీసుల్లో ఒకటి, అంతకంటే ఎక్కువ ఖాతాలలో రూ.20 లక్షలు, అంతకంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే అటువంటి సమయంలో పాన్‌కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరి అవసరం. ఏదేనీ బ్యాంకు, సహకార బ్యాంకు, పోస్టాఫీసులలో కరంట్ ఖాతా, క్యాష్ క్రెడిట్ అకౌంట్ తెరిచినా తప్పనిసరి అవసరం. ఏ ఒక్కరైనా కరంట్ అకౌంట్ తెరవడానికి పాన్ కార్డు సమర్పించాలి. అదే సమయంలో బ్యాంకు ఖాతాలు ఉన్న వారు ఇప్పటికే పాన్‌కార్డు అనుసంధానించినా.. లావాదేవీల సమయంలో తప్పనిసరి పాన్ కార్డు సమర్పించాల్సి ఉంటుంది.