
వాస్తు శాస్త్రం ప్రకారం మన చుట్టూ ఉన్న శక్తి సరిగ్గా లేని సమయంలో అనవసరమైన ఆందోళన, తలనొప్పి , టెన్షన్, నిద్రపట్టక పోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయంట. అయితే ఇటువంటి సమయంలో తప్పకుండా మీ ఇల్లు శుభ్రంగా ఉందో లేదో తనిఖీ చేసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. వంట గది, స్నానాల గది కూడా సరిగ్గా లేని సమయంలో ప్రతికూల శక్తి ఎక్కువగా ఉంటుందంట. వాస్తు శాస్త్రం ప్రకారం ఎవరికైనా రాత్రి నిద్ర సరిగ్గా నిద్రపట్టక, ఇబ్బంది పడటం వంటి సమస్యలు ఎదురు అయితే తప్పకుండా ఒకసారి ఇంటిని శుభ్రం చేసుకోవాలి.

వంటగది ప్రభావం, వాస్తు శాస్త్రం ప్రకారం, వంట గది చాలా శక్తి వంతమైనది. అందువలన వంట గది సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. మురికి పాత్రలను సింక్‌లో ఉంచడం, కుళాయి లీకు అవ్వడం వంటివి అనేక ఇబ్బందులకు కారణం అవుతాయి. అందువలన ఎలాంటి సమస్యలు లేకుండా ఇంటిలో సానుకూల శక్తి ఉండాలి అంటే తప్పకుండా వంట గది శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంట.

ఇంటి ప్రధాన ద్వారం ఇంటి శక్తి కేంద్రం అంటారు. అందువలన ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఎప్పుడూ చెత్త, మురికి లేకుండా చూసుకోవాలి. అలాగే రాత్రి పడుకునే సమయంలో తప్పకుండా ఇంటి తలపులు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా చెప్పులు పెట్టడం లాంటిది అస్సలే చేయకూడదు.

ముఖ్యంగా మీ నిద్ర, శరీరంపై మనసుపై పడక గది ప్రభావం చూపుతుందంట. అందువలన తప్పకుండా పడక గది విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఎట్టి పరిస్థితుల్లో తలను దక్షిణం లేదా తూర్పు వైపు పెట్టి నిద్రపోకూడదు. దీని వలన అనేక ఇబ్బందులు, మనసుకు ప్రశాంతత కరువు అవ్వడం వంటి సమస్యలు ఏర్పడుతాయంట.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు