Cooler: కూలర్‌ను ఏసీగా మార్చుకోండిలా.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే కూల్ కూల్..

Updated on: May 10, 2026 | 1:51 PM

భానుడు భగభగమంటున్నాడు. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రతతో జనం అల్లాడిపోతున్నారు. ఈ వేడిని తట్టుకోవాలంటే ఏసీ ఒక్కటే మార్గమని చాలామంది భావిస్తారు. కానీ, ఏసీ కొనేంత స్తోమత లేకపోయినా లేదా భారీగా వచ్చే విద్యుత్ బిల్లులకు భయపడినా చింతించాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉన్న సాధారణ ఎయిర్ కూలర్‌నే కొన్ని చిన్న మార్పులతో ఏసీలా మార్చుకోవచ్చు. తక్కువ ఖర్చుతో మీ గదిని మంచుకొండలా మార్చే ఆ అద్భుతమైన చిట్కాలు తెలుసుకుందాం..

1 / 5
హనీకోంబ్ ప్యాడ్‌ల మ్యాజిక్: చాలామంది కూలర్లలో పాతకాలపు గడ్డి ప్యాడ్‌లనే వాడుతుంటారు. ఇవి త్వరగా ఎండిపోవడమే కాకుండా గాలిని సరిగ్గా చల్లబరచవు. వీటికి బదులుగా హనీకోంబ్ ప్యాడ్‌లను అమర్చుకోండి. ఇవి తేనెపట్టు ఆకారంలో ఉండి నీటిని ఎక్కువ సేపు నిల్వ ఉంచుకుంటాయి. దీనివల్ల గాలి ఎక్కువ సేపు తేమతో ఉండి, ఏసీ లాంటి చల్లదనాన్ని ఇస్తుంది.

2 / 5
ఐస్ క్యూబ్స్ వాడే సరైన పద్ధతి: కూలింగ్ పెరగాలని చాలామంది ఐస్ క్యూబ్స్‌ను నేరుగా వాటర్ ట్యాంక్‌లో వేస్తుంటారు. దీనివల్ల మోటారు మొరాయించే అవకాశం ఉంది. దానికి బదులుగా, కూలర్ పైభాగంలో ఉండే వాటర్ ట్రేలో ఐస్ క్యూబ్స్ వేయండి. అక్కడ నీరు చల్లబడి ప్యాడ్ల మీద పడినప్పుడు, గాలి సాధారణం కంటే 5°C నుండి 8°C వరకు అదనపు చల్లదనాన్ని ఇస్తుంది. గాలిలో సువాసన కోసం నీటిలో రెండు చుక్కల లెమన్‌గ్రాస్ లేదా లావెండర్ ఆయిల్ కలిపితే ఇల్లంతా ఫ్రెష్‌గా ఉంటుంది.

3 / 5
క్రాస్ వెంటిలేషన్ - కిటికీలు మూయకండి: ఏసీ వాడేటప్పుడు గది తలుపులు మూసేస్తాం. కానీ కూలర్ విషయంలో అలా చేస్తే హ్యుమిడిటీ పెరిగిపోతుంది. కూలర్‌ను కిటికీకి దగ్గరగా పెట్టి, బయటి గాలి వెనుక వైపు నుండి లోపలికి వచ్చేలా చూడాలి. గదికి అవతలి వైపు ఉన్న తలుపు లేదా కిటికీని కొద్దిగా తెరిచి ఉంచితే గాలి బయటకు వెళ్లి క్రాస్ వెంటిలేషన్ జరుగుతుంది. దీనివల్ల ఉక్కపోత తగ్గి, గది చల్లగా మారుతుంది.

4 / 5
ఆ 15 నిమిషాల విరామం ముఖ్యం: కూలర్ స్విచ్ వేయగానే ఫ్యాన్ ఆన్ చేయకండి. ముందుగా పంప్ ఆన్ చేసి 10 నుండి 15 నిమిషాల పాటు నీటిని పారనివ్వండి. కూలింగ్ ప్యాడ్‌లు పూర్తిగా తడిచిన తర్వాత ఫ్యాన్ ఆన్ చేస్తే, మొదటి నిమిషం నుండే మీకు చల్లని గాలి వస్తుంది. ప్యాడ్‌లు తడవకముందే ఫ్యాన్ వేస్తే వచ్చే వేడి గాలిని దీనివల్ల నివారించవచ్చు.

5 / 5
ఉప్పు నీటితో జాగ్రత్త - క్లీనింగ్ టిప్స్ : మీరు వాడే నీరు ఉప్పు నీరు అయితే, అది ప్యాడ్‌లపై పేరుకుపోయి గాలిని అడ్డుకుంటుంది. అందుకే వారానికి ఒకసారి ట్యాంక్ శుభ్రం చేయాలి. నీటిని మార్చేటప్పుడు ఒక టీస్పూన్ వెనిగర్ లేదా బేకింగ్ సోడా కలిపితే నాచు పట్టదు, బ్యాక్టీరియా చేరదు. దీనివల్ల మీకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన గాలి అందుతుంది.

Follow Us