ముదిరిన మటన్ కుక్కర్లో ఉడికినట్టు బయట కూడా ఉడకాలంటే ఇది వేస్తే చాలు.. నిమిషాల్లోనే మెత్తగా..

Updated on: Oct 26, 2026 | 8:44 AM

మటన్ కుక్కర్లో ఉడికినట్టు బయట కూడా ఉడకాలంటే ఈ ఒక్కటి వేస్తే చాలు.. ఇలా చేస్తే మటన్ ముక్కలు బాగా మెత్తగా ఉడికి, గ్రేవీ చిక్కగా, మంచి రుచి వస్తుంది. మటన్ కూరను మరింత రుచిగా ఎలా తయారు చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

1 / 5

కావాల్సిన పదార్థాలు: మటన్: పావు కిలో,  ఉల్లిపాయలు: 1 పెద్దది, 1 చిన్నది , పచ్చిమిర్చి: 4 ,  అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 స్పూన్లు,  
 పసుపు: అర టీ స్పూను,  కారం: 3 స్పూన్లు , సాల్ట్: 1 స్పూను,  గరం మసాలా: 2 స్పూన్లు , ధనియాల పొడి: 1 స్పూను,   టమాటా పేస్ట్: 1 టమాటా , కరివేపాకు: ఒక రెమ్మ,   కొత్తిమీర: సన్నగా తరిగినది తీసుకోవాలి. నూనె: 5 స్పూన్లు , నీళ్లు: ఒకటిన్నర టీ గ్లాసు తీసుకోవాలి.

కావాల్సిన పదార్థాలు: మటన్: పావు కిలో, ఉల్లిపాయలు: 1 పెద్దది, 1 చిన్నది , పచ్చిమిర్చి: 4 , అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 స్పూన్లు, పసుపు: అర టీ స్పూను, కారం: 3 స్పూన్లు , సాల్ట్: 1 స్పూను, గరం మసాలా: 2 స్పూన్లు , ధనియాల పొడి: 1 స్పూను, టమాటా పేస్ట్: 1 టమాటా , కరివేపాకు: ఒక రెమ్మ, కొత్తిమీర: సన్నగా తరిగినది తీసుకోవాలి. నూనె: 5 స్పూన్లు , నీళ్లు: ఒకటిన్నర టీ గ్లాసు తీసుకోవాలి.

2 / 5
ముందుగా స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని, రెండు స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక, ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు మరియు రెండు పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.  ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత, శుభ్రం చేసిన పావు కిలో మటన్ ముక్కలు వేసి, నూనెలో రెండు నిమిషాలు పాటు బాగా వేయించాలి.

3 / 5
తరువాత, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చివాసన పూర్తిగా పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు, పావు టీ స్పూను పసుపు, ఒక స్పూను కారం, ఒక స్పూను సాల్ట్, ఒక స్పూను గరం మసాలా వేసి, మటన్ ముక్కలకు మసాలా బాగా పట్టేలా చక్కగా కలుపుకోవాలి. చివరగా, ఒక చిన్న టీ గ్లాసు నీళ్లు పోసి, కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది మటన్ మెత్తగా ఉడకడానికి సహాయపడుతుంది.

4 / 5
మటన్ ఉడికే లోపు, స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని, మూడు స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక, ఒక చిన్న ఉల్లిపాయ తరుగు, రెండు పచ్చిమిర్చి,  ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా వేయించాలి.  ఇవి కొద్దిగా వేగిన తర్వాత, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి.  తరువాత, పావు టీ స్పూను పసుపు, రెండు స్పూన్ల కారం,  ఒక స్పూను ధనియాల పొడి వేసి, ఒక నిమిషం పాటు తక్కువ మంట మీద వేయించాలి.

5 / 5
 ఇప్పుడు, ఒక టమాటా నుండి తీసిన టమాటా పేస్ట్‌ను వేసి, టమాటా పచ్చివాసన పూర్తిగా పోయేంత వరకు వేయించుకోవాలి. ముందుగా కుక్కర్‌లో ఉడికించుకున్న మటన్‌ను, దానిలోని నీళ్లతో సహా ఈ గ్రేవీలోకి వేయాలి. అర కప్పు నీళ్లు పోసి, బాగా కలిపి మూత పెట్టి పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే, ఆయిల్ పైకి తేలి గ్రేవీ చిక్కగా అయినట్లు గమనిస్తారు.
 చివరగా, ఒక స్పూను గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి, ఒక రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

ఇప్పుడు, ఒక టమాటా నుండి తీసిన టమాటా పేస్ట్‌ను వేసి, టమాటా పచ్చివాసన పూర్తిగా పోయేంత వరకు వేయించుకోవాలి. ముందుగా కుక్కర్‌లో ఉడికించుకున్న మటన్‌ను, దానిలోని నీళ్లతో సహా ఈ గ్రేవీలోకి వేయాలి. అర కప్పు నీళ్లు పోసి, బాగా కలిపి మూత పెట్టి పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే, ఆయిల్ పైకి తేలి గ్రేవీ చిక్కగా అయినట్లు గమనిస్తారు. చివరగా, ఒక స్పూను గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి, ఒక రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us