ఉతికేటప్పుడు నీటిలో ఇది ఒక్కటి వేస్తే చాలు.. పిల్లల బట్టల నుంచి క్షణాల్లో పాల వాసన మాయం!

Updated on: Aug 28, 2026 | 12:21 PM

చిన్న పిల్లలకు పాలు తాపేటప్పుడు అవి బట్టలపై ఒలికిపోవడం చాలా సాధారణం. ఎందుకంటే పిల్లలు ఒక్కచోట కుదురుగా ఉండరు. పాలు తాపేటప్పుడు అటూ ఇటా కదలడం, లేదా తాగిన పాలను బయటకు ఊచడం వల్ల అవి వాళ్ల బట్టలపై పడిపోతూ ఉంటాయి. ఇవి చాలా త్వరగా బట్టల్లోకి ఇంకిపోతాయి. అందువల్ల వాటిని ఉతికిన తర్వాత కూడా వాటి నుంచి పాల వాసన వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా నవజాత శిశువుల బట్టలలోని ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ బట్టలను ఉతికేటప్పుడు కొన్ని చిట్కాలు వాడితే ఈజీగా వాటి నుంచి పాల వాలసనను తొలగించవచ్చు. ఆ చిట్కాలు ఏంటి.. పిల్లల బట్టల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ చూద్దాం.

1 / 5
 నానబెట్టడం: చాలా మంది పాలు పడిన తర్వాత కూడా పిల్లలకు బట్టలను తొలగించకుండా అలాగే ఉంచుతారు. కానీ అలా చేయకూడదు. బట్టలపై పాలు పడిన వెంటనే వాటిని అలాగే వదిలేయకుండా.. పిల్లలకు వేరే బట్టలు మార్చి.. పాలు పడిన భాగాన్ని చల్లని లేదా సాధారణ నీటితో శుభ్రంగా కడగాలి. లేదంటే ఎక్కవ సమయం అలాగే ఉంచడం ద్వారా ఆ పాలు బట్టల దారల్లోకి చొచ్చుకుపోయి వాసన అలాగే ఉండే ప్రమాదం ఉంటుంది.

2 / 5
బేకింగ్ సోడా: ఇప్పుడు ఒక బకెట్ నిండా నీటిని తీసుకొని 1 నుండి 2 చెంచాల బేకింగ్ సోడా కలపండి. ఇప్పుడు మీ పిల్లల బట్టలను ఆ నీటిలో 15 నుండి 30 నిమిషాల పాటు నానబెట్టండి. బేకింగ్ సోడా బట్టలలోని వాసనను తొలగించడానికి బాగా  సహాయపడుతుంది. ఆ తర్వాత బట్టలను సాధారణంగా ఉతికేసి కంఫర్ట్‌లో నానబెట్టి ఆరవేయండి. అంతే బట్టల నుంచి పాల వాసన తొలగిపోయి.. తాజాగా సువాన వెదజల్లుతోంది. ఇది పిల్లలకు కూడా ఉంతో హాయిని ఇస్తుంది.

3 / 5
బట్టలలో పాల వాసన ఎందుకు ఉండిపోతుందంటే.. సాధారణంగా పాలల్లో ప్రొటీన్, కొవ్వు ఉంటాయి. ఇవి బట్టలపై పడినప్పుడు వాటిని అలాగే వదిలేయడం వల్ల ఆ అవశేషాలు బట్టల దారాల్లోకి ఇంటికిపోతాయి. వీటిని ఎక్కవ రోజులు అలానే ఉంచితే బరించలేని వాసన కూడా వస్తుంది. కాబట్టి పిల్లల బట్టలను వెంటనే ఉతకడం లేదా కనీసం నీటితో కడిగి పక్కన పెట్టడం మంచిది.

4 / 5
వేడి నీటిని వాడకండి: అయితే చాలా మంది పాల మరకలను శుభ్రం చేయడానికి బట్టలను వేడి నీటిలో నానబెడుతుంటారు. కానీ ఇలా చేయడం తప్పు.. పాలలో ప్రొటీన్ ఉంటుంది. కాబట్టి ఈ మరకలకు చల్లని లేదా సాధారణ నీటిలోనే శుభ్రం చేయడం మంచిది.   వేడి నీటిలో నానబెట్టడం వల్ల మరక, వాసన బట్టలలో గట్టిగా నిలిచిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడూ ఈ తప్పు చేయకండి.

5 / 5
పిల్లల బట్టలను ఉతికేటప్పుడు ఎప్పుడూ మైల్డ్ డిటర్జెంట్లనే వాడండి. ఎందుకంటే పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి, ఘాటైన రసాయనాలు లేదా ఎక్కువ సువాసన ఉండే డిటర్జెంట్లను వాడడం వల్ల వారికి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. అలాగే పిల్లల బట్టలను తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టండి. తడిగా ఉంటే పిల్లలకు చికాకుతో పాటు వాటి నుంచి ముక్కు వాసన వచ్చే ఛాన్స్ ఉంది.( గమనిక ఏదైనా కొత్త చిట్కా పాటించే ముందు బట్టలోని చిన్న భాగంపై పరీక్షించి చూడటం మంచిది)

Loading...
Unable to load recommendations.
Follow Us