ఎండు చేపలు వడియాల కూర ఇలా చేస్తే అస్సలు వదిలిపెట్టరు.. జీవితంలో ఒక్కసారైనా తినాలి

Updated on: Mar 07, 2026 | 11:27 AM

ఎండు చేపలు వడియాల కూర ఆంధ్రాలో చాలా ఫేమస్. వారంలో రెండు సార్లు తింటారు. ఒకసారి మీరు దీనిని ఇలా చేస్తే అస్సలు వదిలిపెట్టరు. అంత రుచిగా ఉంటుంది. ఇలాంటి కూరను జీవితంలో ఒక్కసారైనా తినాలి. మరి, ఇంకెందుకు లేట్ ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5
కావాల్సిన పదార్ధాలు : 100గ్రాములు ఎండు చేపలు, వడియాలు,  4 టమాటాలు, 2 ఉల్లిపాయలు, ఒక కప్పు చింత పండు రసం, 4 పచ్చిమిర్చి, రెండు టేబుల్ స్పూన్స్ కారం, అర టీ స్పూన్ ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్,  వెల్లుల్లి పేస్ట్, మసాలా, నూనెను తీసుకోవాలి.

2 / 5
ముందుగా ఎండు చేపలను తీసుకుని బాగా కడిగి శుభ్రపరచుకోవాలి ఆ తర్వాత బంగారు రంగులోకి మారే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.  ఆ తర్వాత వడియాలను కూడా  బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

3 / 5
 వేయించిన చేపలను, వడియాలను ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి ఆరిపోయిన తర్వాత కూరలో వేసుకోవాలి.

4 / 5
ఇక ఇప్పుడు అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, అర టీ స్పూన్  జీలకర్ర, కరివేపాకు ఆకులు, ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చిని వేసి బాగా వేయించాలి.

5 / 5
ఉల్లిపాయ మిశ్రమం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ పసుపు వేసి మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించాలి. ఒక కప్పు  చింతపండు రసం పోసి కొద్దిసేపటి తర్వాత ఎండు చేపలు, వడియాలు బాగా ఉడికించాలి. దించే ముందు కొత్తిమీర  వేసి దించేయండి.

Follow Us