
రాగి పిండి బూరెలకు కావలసిన పదార్థాలు : ఒక కప్పు శనగపప్పు, ఒక కప్పు బెల్లం తురుము , అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు గోధుమ పిండి , రుచికి సరిపడా ఉప్పు , సరిపడా నీరు, ఇంకా వీటిని వేయించడానికికావాల్సినంత నీటిని తీసుకోవాలి.

రాగి పిండి బూరెల తయారీ విధానం : ముందుగా ఒక కప్పు శనగపప్పును తీసుకుని దానిని బాగా నానబెట్టాలి. ఆ తర్వాత దీనిని కుక్కర్‌లో వేసి మరి మెత్తగా కాకుండా ఒక మాదిరిగా ఉడికించాలి. అయితే, ఉడికిన తర్వాత దీనిలో ఉన్న నీటిని వేరు చేయాలి. ఉడికిన శనగపప్పును మెత్తగా పట్టుకుని పక్కన పెట్టుకోవాలి.

రాగి పిండి బూరెల తయారీ విధానం స్టెప్ 1 : ఇక ఇప్పుడు పాన్‌లో బెల్లాన్ని వేసుకుని ఆ తర్వాత అది పాకం అయ్యే వరకు పొయ్యి మీదే ఉంచి బాగా తిప్పుకోవాలి మరి ముదురు పాకం అయ్యేవరకు దీనిని ఉంచకండి. ఇంకా దీనిలో కొద్దిగా యాలకుల పొడి కూడా వేసి చిక్కగా అయ్యే వరకు గరిటెతో దీనిని బాగా కలుపుతూ ఉండాలి.

రాగి పిండి బూరెల తయారీ విధానం స్టెప్ 2 : ఈ బెల్లం పాకంలో రాగి పిండి, బియ్యం పిండి కొద్దిగా ఉప్పు కూడా వేసి కలపాలి. ముందుగా పక్కన పెట్టుకున్న శనగపప్పు ముద్దను దీనిలో వేసి బాగా కలిపుకోవాలి. ఇలా కలుపుకున్న తరవాత చిన్న చిన్న ఉండలు మాదిరి చేసుకుని బుడ్డి పప్పల్లాగా వీటిని పెట్టుకోవాలి.

రాగి పిండి బూరెల తయారీ విధానం స్టెప్ 3 : ఒత్తిన పప్పలను తీసుకుని మరుగుతున్న ఆయిల్ లో వేసి వీటిని బాగా కాల్చుకోవాలి. అలాగే ఒకేసారి మరి ఎక్కువ వేయకుండా 7 నుంచి 8 పప్పులను వేసి ఎర్రగా బాగా కాల్చుకోవాలి. ఇలా బాగా కాల్చిన బూరెలను తీసుకుని ఒక టిష్యూపై వేస్తే నూనె మొత్తం పోతోంది అంతే.. వేడి వేడి రాగి పిండి బూరెలు రెడీ