
బార్లీ మన శరీరానికి ఎంత మంచిదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, దీనిలో పోషకాలు అధికంగా ఉంటాయి. అంతేకాదు, ఇది నేచురల్ ఔషధం. మన శరీరంలోని వేడిని తగ్గించి శక్తిని పెంచుతుంది. అసలు ఇది మన శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది. ఈ బార్లీ నీళ్లను ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

ధాన్యాలు (బార్లీ లేదా బియ్యం): అక్షయ తృతీయ నాడు ధాన్యాలను ఇంటికి తీసుకురావడం వల్ల ధన ధాన్యాలకు లోటు ఉండదని నమ్ముతారు. ముఖ్యంగా బార్లీ (Barley) కొనుగోలు చేయడం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. అక్షయ తృతీయ రోజున ఇంట్లోకి బియ్యం తీసుకురావడం కూడా శుభప్రదం. బియ్యం అన్నపూర్ణాదేవి స్వరూపంగా, సిరిసంపదలకు చిహ్నంగా పూజిస్తారు. అలాంటి బియ్యాన్ని ఆ రోజు ఇంటికి తెచ్చుకుంటే అంతా మంచే జరుగుతుంది.

అంతేకాదు, ఇది కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా ఇది పెంచుతుంది. అయితే, ఈ బార్లీ నీటిని మజ్జిగ, నిమ్మరసంతో తాగితే.. టేస్టీగా ఉంటుంది. ఇంకా వేసవిలో అయితే బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ బార్లీ నీళ్ళను ఎలా చేయాలంటే? ముందుకు వీటిని తీసుకుని బాగా వేయించుకొని, వాటిని పొడిలాగా చేసుకోవాలి. మూడు కప్పుల నీటిని తీసుకుని వాటిని బాగా మరిగించాలి. అలాగే, తర్వాత దీనిలో రెండు స్పూన్ల బార్లీ పొడిని వేసి బాగా కలుపుకోవాలి.

ఆ తర్వాత వీటిని పదిహేను నిమిషాలు మెత్తగా అయ్యేవరకు వీటిని ఉడికించి వడకట్టుకోవాలి. ఈ నీటికి పావు గ్లాసు పల్చని మజ్జిగ, కొద్దిగా ఉప్పు వేసి తాగితే ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు.