
కావాల్సిన పదార్ధాలు: 200 గ్రాములు ఎండు చేపలు, చిన్న ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి , ఒక కప్పు చింతపండు రసం, అర కిలో వంకాయలు, 2 టేబుల్ స్పూన్స్ కారం, అర టీ స్పూన్ పసుపు, ఉప్పు రుచికి తగినంత, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్స్ నూనె, కరివేపాకు, కొత్తిమీర.

ముందుగా ఎండు చేపలను బాగా శుభ్రం చేసుకోవాలి. ఐదు సార్లు నీళ్ళలో కడిగి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో నూనె వేసి, ఎండు చేపలను వేసి రంగు మారే వరకు వేయించుకోవాలి.

అదే పాన్ లో మళ్ళీ ఆయిల్ వేసి, కరివేపాకు, ఉల్లిపాయలు ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించాలి.

కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను ఆ మిశ్రమంలో వేసి వాటిని మగ్గనివ్వాలి. ఆ తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న ఎండుచేపలను వేసి మిక్స్ అయ్యేలా తిప్పుకోండి.

వంకాయలు ఉడికిన తర్వాత, కారం, చింతపండు రసం పోసి గరిటె తో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. గ్రేవీ కోసం కొద్దిగా రెండు గ్లాస్ ల నీళ్లు పోసి, మూత పెట్టి అలా 10 నిముషాల పాటు ఉంచుకోండి. దించే ముందు కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ లోకి వడ్డించుకుని తినేయండి.