
పల్లెల్లో వారంలో ఈ పచ్చడిని రెండు సార్లు తింటారు. విపరీత వేడిని తగ్గించడానికి అదే బెస్ట్. దీనిని మీరు వేడి వేడి అన్నంతో తింటే ఆ రుచి ఎక్కడా దొరకదు. ఇంకా చపాతీల్లోకి కూడా మంచిగా ఉంటుంది. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం..

బండ పచ్చి మిర్చి పచ్చడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు: రెండు మీడియం సైజ్ఉల్లిపాయలు, 150 గ్రాములు పచ్చి మిర్చి , 10 వెల్లుల్లి రెబ్బలు , నిమ్మకాయ సైజంత చింతపండు, రుచికి తగినంత ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ , ఒక టేబుల్ స్పూన్స్ నెయ్యి , ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర , 10 కరివేపాకు ఆకులు తీసుకోవాలి.

బండ పచ్చి మిర్చి పచ్చడి తయారీ విధానం: ముందుగా పచ్చి మిర్చిని రెండు సార్లు బాగా కడిగి వీటిని వేయించుకోవాలి. ఆ తరవాత పాన్‌లో వేసి మీడియం మంట మీద వీటిని బాగా వేయించాలి. అయితే, ఇవి మాడిపోకుండా చూసుకోవాలి. ఇంకా బంగారు రంగులోకి మారగానే పొయ్యి మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి.

ఉల్లిపాయలను కట్ చేసుకోవాలి: రెండు ఉల్లిపాయలను తీసుకుని బాగా కడిగి చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇంకా మళ్ళీ ఇంకో సారి పాన్ పెట్టి ఒక కప్పు పల్లీలు కూడా వేయించుకోండి. ఇవి మీరు తినాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. అంతేకాదు మంటను కూడా కవర్ చేస్తుంది. వీటి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి

రోటిలో కొద్దిగా చింతపండు, పచ్చి మిర్చి, పల్లీలు, రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ధనియాలు వేసి, ఇంకా నీటిని కూడా పోసి వీటిని కచ్చా పచ్చాగా బాగా దంచుకోవాలి. ఈ పచ్చడి తింటే ఏ కూరలు కూడా దీని ముందు సరిపోవు. చిన్న పాన్ తీసుకుని పోపు పెట్టి ఈ పచ్చడిపై పోయాలి. యూరిన్ సమస్యలు ఉన్నవాళ్లు దీనిని తినాలి.