Watermelon: పుచ్చకాయను కోయకుండానే రెడ్‌గా ఉందో లేదో తెలుసుకోవడం ఎలా..?

|

Apr 01, 2023 | 1:29 PM

పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో శరీరంలో వేడిని తగ్గించి చలవ చేసే గుణం ఉంటుంది. ఎండా కాలంలో తినడం ఎంతో మేలు. వేసవి తాపాన్ని, దాహాన్ని తీర్చేందుకు అద్భుతమైన ఫలం పుచ్చకాయ అనే చెప్పాలి. మార్కెట్లో రకరకాల పుచ్చకాయలు అమ్మతున్నారు. పుచ్చకాయను కొనే ముందు జాగ్రత్తగా..

1 / 5
పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో శరీరంలో వేడిని తగ్గించి చలవ చేసే గుణం ఉంటుంది. ఎండా కాలంలో తినడం ఎంతో మేలు. వేసవి తాపాన్ని, దాహాన్ని తీర్చేందుకు అద్భుతమైన ఫలం పుచ్చకాయ అనే చెప్పాలి. మార్కెట్లో రకరకాల పుచ్చకాయలు అమ్మతున్నారు. పుచ్చకాయను కొనే ముందు జాగ్రత్తగా చూసి తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

2 / 5
పుచ్చకాయ..  ఇది ఆదర్శవంతమైన వేసవి పండు. పుచ్చకాయలో 90 శాతం నీరు ఉంటుంది. అంతేకాక యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఏ, బీ6, సీ, పొటాషియం, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడతాయి. పుచ్చకాయ సహజంగా మీ శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది.

3 / 5
కనీసం రెండు కిలోలు, అంతకంటే ఎక్కువ బరువు ఉండే పుచ్చకాయను ఎంచుకోవాలి. అయితే పుచ్చకాయ ఏ రంగులో ఉన్నా పర్వాలేదు. పైన చారలు ఉన్నా, లేకపోయినా ఏమి కాదు. పుచ్చకాయ తొడిమ ఎండిపోయినట్లు ఉండాలి. తొడిమ లేకపోతే తొడిమ ఉండే ప్రాంతం గట్టిగా ఎండినట్లు ఉండాలి. అలాగే పుచ్చకాయ గట్టిగా, బరువుగా ఉండాలి. మెత్తగా ఉంటే అది లోపల పాడైనట్లు గుర్తించాలి.

4 / 5
అలాగే కొన్ని పుచ్చకాయలపై గోధుమ లేదా పసుపు రంగు మచ్చలుంటాయి. చారలతో సంబంధం లేకుండా ఆ మచ్చలు దాదాపు గుండ్రంగా ఉంటాయి. మచ్చలు ఎంత ఎక్కువా ఉంటే ఆ పుచ్చకాయ లోపల అంత ఎర్రగా ఉంటుందని తెలుసుకోవాలి. ఒక్కో వాటర్‌ మిలన్‌ పై ఒకటే మచ్చ ఉంటుంది. కొన్నింటికి రెండు, మూడు మచ్చలుంటాయి. ఎంత ఎర్రగా ఉంటే అంత ఎక్కువ పోషకాలు ఉంటాయి.

5 / 5
పుచ్చకాయపై ఉండే తొడిమ ఎండిందో లేదో చూసుకోవాలి. అప్పుడు కట్‌ చేయకపోయినా లోపల మాత్రం ఎర్రగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కోసిన పుచ్చకాయని ఇంట్లో ఫ్రిడ్జ్‌లో లేదా ఎండ తగలని ప్రదేశంలో ఉంచినా పాడవదు. ఇలా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుచ్చ కాయను కొనే ముందు ఇలాంటివి గమనిస్తూ తీసుకుంటే మరి మంచిదంటున్నారు.