
వేసవికాలంలో తులసి మొక్కలు ఎండిపోతుంటాయి. ఇంకా ఆకులు కూడా రాలిపోతుంటాయి. అయితే, చాలామంది ఈ సమస్య చెబుతున్నారు. ఊరిలో పాటించే టిప్స్ పాటిస్తే తులసి మొక్క గుబురుగా పెరుగుతుంది. ముఖ్యంగా, గింజలు చల్లే విధానం కూడా చాలా ముఖ్యం. ఇది సరిగ్గా ఉంటే.. మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా ఇల్లు మొత్తం నిండిపోతుంది.

తులసి గింజలు ఇలా చల్లాలి? మీరు ముందుగా మంచి తులసి గింజలను ఎంచుకోవాలి. వాటిని పెద్ద కుండీల్లో వేసి ఎర్రమట్టి, కంపోస్ట్ కలిపిన మిశ్రమాన్ని కూడా దీనిలో వెయ్యాలి. ఆ తరవాత గింజలను ఒక దగ్గర కాకుండా కొంచం కొంచం గ్యాప్ ఇచ్చి చల్లాలి. అలాగే, మరి చాలా లోతుగా కూడా వీటిని అస్సలు పూడ్చకూడదు. ఇంకా ఈ గింజలపై కొంచం మట్టి వెయ్యాలి.

నీళ్లు ఎలా పోయాలి? గింజలు చల్లిన తరవాత మరి ఎక్కువగా అసలు నీళ్లు పొయ్యకూడదు. అలా నీళ్లు పోస్తే అసలుకే ఎసరు వస్తుంది సీడ్స్ మొత్తం కుళ్లిపోతాయి. కాబట్టి, స్ప్రే బాటిల్‌తో కొద్దిగా కొద్దిగా నీరు పోస్తూ ఉండాలి. ఇంకా రోజూ ఉదయం 7 లేదా సాయంత్రం 4 తరవాత నీటిని పోస్తూ ఆ ప్రదేశం దగ్గర తేమ ఉండేలా చూసుకోవాలి.

ఎండ నుంచి వీటిని ఎలా కాపాడాలి? సమ్మర్లో మధ్యాహ్నం ఎండ విపరీతంగా ఉంటుంది. కాబట్టి, ఆ సమయంలో వీటిని నీడ కింద పెట్టాలి. అలా పెడితే మొక్కలు రావు అలాగే పైకి కనిపించవు కూడా. ఇక ఉదయం సూర్యకాంతి వచ్చే వరకు ఈ మొక్క అలాగే ఉంచితే పెరుగుతుంది. మధ్యాహ్నం వేడి ఎక్కువైతే అక్కడి నుంచి దూరం పెట్టండి.

గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి: మొక్క పెరిగిన తర్వాత పైన కొంచం కట్ చేయండి. ఆ తరవాత కొమ్మలు బాగా వస్తాయి. అలాగే నెలలో రెండు సార్లు ఎరువులు వేస్తే ఆకులు పచ్చగా అవుతాయి. ఎండిపోయిన ఆకులు, కొమ్మలు ఎప్పటికప్పుడు తీసేస్తే కొత్త చిగురు కొమ్మలు కొద్దీ రోజుల్లోనే వస్తాయి.