రోజుకు ఎన్ని చెంచాల నెయ్యి తినాలి..? అతిగా తింటే ఏమవుతుందంటే..

|

Aug 10, 2024 | 7:07 PM

ప్రతిరోజూ నెయ్యిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు దాదాపు అందరికీ తెలుసు.. నెయ్యి మన ఆహారం రుచిని పెంచడమే కాకుండా అనేక ఔషధ లక్షణాలను కలిగి ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు అని చెబుతారు. మనలో చాలా మంది నెయ్యిని ఎక్కువగా వాడుతుంటారు. రుచికరమైన స్వీట్ల నుంచి ఘుమఘుమలాడే బిర్యానీ వరకు చాలా వంటకాల్లో నెయ్యిని వినియోగిస్తారు. వంటలో సాధారణ వంట నూనెలకు బదులుగా నెయ్యిని ఉపయోగిస్తుంటారు. నెయ్యితో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నప్పటికీ.. ప్రతిరోజూ సరైన మోతాదులో తినడం చాలా ముఖ్యం.

1 / 5
నెయ్యి మన శరీరంలోని మలినాలను తొలగించి శక్తిని అందిస్తుంది. ఇందులో బ్యూట్రిక్ యాసిడ్, విటమిన్ ఎ, డి, ఇ, కె కలయిక రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణ పనితీరును మెరుగుపరుస్తుంది. ప్రేగుల్లో కదలికను మెరుగుపరచడానికి నెయ్యి తినవచ్చు. మలబద్ధకం ఉన్నవారు తప్పనిసరిగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తినాలి.

2 / 5
నెయ్యి తినడం వల్ల ఎక్కువ సమయం కడుపు నిండినట్లుగా ఉంటుంది. దీంతో మీరు అతిగా తినకుండా ఉంటారు. తద్వారా బరువు పెరగకుండా ఉంటారు. నెయ్యి తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. ముఖం అందంగా కనిపిస్తుంది. చర్మం ముడతలు తగ్గి వయసు తగ్గినట్లుగా మారిపోతారు. జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. నెయ్యి ఎముకల దృఢత్వాన్ని, బలాన్ని, శక్తిని పెంచుతుంది. శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన ఎంజైమ్‌లు ఉదర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

3 / 5
మీరు ఖాళీ కడుపుతో ఒక చెంచా నెయ్యి తింటే చెడు ఆహారపు అలవాట్ల కారణంగా కలిగే సమస్యలు తగ్గుతాయి. నిద్రలేమి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, రోజంతా కూర్చునే అలవాటు, శారీరక శ్రమ తక్కువగా ఉండటం, యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం వంటి అనేక కారణాల వల్ల కడుపు సంబంధిత అనారోగ్యానికి గురవుతుంటారు. అలాంటివారు నెయ్యి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

4 / 5
ఆరోగ్యకరమైన జీవితానికి రోజుకు ఎన్ని చెంచాల నెయ్యి తినాలో ఒక నిర్దిష్ట సమాధానం లేదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఇది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. నిపుణుల సూచన మేరకు రోజుకు 2-3 చెంచాల నెయ్యి తినడం మంచిదని సూచిస్తున్నారు.

5 / 5
ఇకపోతే, ఆవు నెయ్యి, గేదెనెయ్యి రెండింటీలో చూస్తే.. ఆవు నెయ్యి శ్రేష్ఠమైనదంటున్నారు నిపుణులు. ఆవు నెయ్యి చూసేందుకు కాస్త పసుపు రంగులో కనిపిస్తుంది. ఎందుకంటే.. ఇందులో బీటా-కెరోటిన్‌ ఎక్కువగా ఉండటంతో అది పసుపు రంగులో ఉంటుంది. అదే.. గేదె నెయ్యి తెల్లగా రుచిగా ఉంటుంది. కానీ, ఆవు నెయ్యిలో కొవ్వు శాతం తక్కువ కావడంతో పాటు, జీవక్రియను పెంచి బరువును తగ్గించే కాంజ్యుగేటెడ్‌ లినోలియాక్‌ ఆమ్ల శాతం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే.. ఆవు నెయ్యిని అన్ని వయసులవాళ్లూ తీసుకోవచ్చునని చెబుతున్నారు.