Fish Storage: చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు స్టోర్ చేయొచ్చు.. 99శాతం మందికి అస్సలు తెలియదు!

Updated on: Oct 25, 2026 | 8:32 AM

చేపలు తినడం ప్రతి ఒక్కరికి ఇష్టమే.. కొందరు వారంలో రెండు సార్లు చేపలు తింటారు. అలాంటి వారు మార్కెట్‌కు వెళ్లి ఒకేసారి చేపలు తెచ్చి ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకొని తింటారు. కానీ ఇలా చేసే చాలా మందికి చేపలను ఫ్రిజ్ లేదా ఫ్రీజర్‌లో ఎన్ని రోజులు ఉంచవచ్చో తెలియదు. ఈ విషయంలో సరైన అవగాహన లేకపోతే తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్, కడుపు సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే మాంసాహారాలలో బ్యాక్టీరియా చాలా వేగంగా వృద్ధి చెందుతుంది కాబట్టి చేపలను ఎన్ని రోజుల వరకు ఫ్రిజ్‌లో స్టోర్‌ చేసిన తినవచ్చో ఇక్కడ చూద్దాం.

1 / 5
చేపలను ఎన్ని రోజులు భద్రపరచవచ్చు?: మీరు మార్కెట్‌ నుంచి తెచ్చిన తాజా పచ్చి చేపలు ఫ్రీజర్‌లో కాకుండా సాధారణ ఫ్రిజ్‌లో 48 గంటలు అంటే 2 రోజులు వరకు ఉంచి తినవచ్చు. అలా కాకుండా ఫ్రీజర్‌లో ఉంచితే మరో 24 గంటల పాటు వాటిని వాడుకోవచ్చు. అదే మీరు మార్కెట్‌ నుంచి తెచ్చిన చేపలు అప్పటికే కాస్త పాతవిగా అనిపిస్తే వాటిని తెచ్చిన రోజే వండుకోవడం ఉత్తమం.

2 / 5
అలాగే చాలా మంది చేపల కూర లేదా వేయించిన చేపలను కూడా ఫ్రిజ్‌లో పెట్టి తింటుంటారు. వీటిని కూడా ఎక్కవ రోజులు ఫ్రిజ్‌లో ఉంచరాదు.. కూర చేసిన చేపలను 1 లేదా 2 రోజులలోపే తినడం మంచిది లేదంటే అది చెడిపోయి.. ఫడ్‌పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పచ్చి చేపలైనా, చేపల కూరైన ఒకటి రెండ్రోజులకు మించి స్టోర్ చేయడం మంచిది కాదు.

3 / 5
చేపలతో పాటు రొయ్యలు లేదా కణవ లాంటి సీఫుడ్‌ను కూడా ఎక్కువ మంది తినేందుకు ఇష్టపడతారు. అయితే వీటిని చేపల్లా ఎక్కవ రోజులు స్టోరి చేసి తినడం మంచిది కాదు.. వీటిని వీలైనంత త్వరగా వండుకోవాలి. అలా కాదని ఎక్కువ రోజులు ఉంచితే వాటి రుచి తగ్గిపోయే ప్రమాదం ఉంది.

4 / 5
ఎలా స్టోర్ చేయాలి: అయితే చేపలను ఎలా స్టోర్ చేస్తున్నామనేది కూడా ఇక్కడ చాలా ముఖ్యం. చేపలు తెచ్చిన వెంటనే మొప్పలు, పొట్టలోని వ్యర్థ భాగాలను తీసేసి శుభ్రంగా కడగాలి. తర్వాత చేపలపై ఏమాత్రం తేమ లేకుండా గుడ్డ లేదా టిష్యూతో పూర్తిగా తుడవాలి. సాధారణ కవర్లలో ఉంచకుండా గాజు లేదా ప్లాస్టిక్ ఎయిర్-టైట్ కంటైనర్లు లేదా జిప్‌లాక్ బ్యాగుల్లో భద్రపరచాలి. దీనివల్ల చేపల వాసన ఫ్రిజ్ అంతా వ్యాపించదు.

5 / 5
అయితే ఫ్రీజర్‌లో పెట్టే ముందు చేప ముక్కలకు కొద్దిగా పసుపు, ఉప్పు లేదా నిమ్మరసం రాసి పెడితే చేపలు ఎక్కువసేపు తాజాగా ఉంటాయి. ఫ్రీజర్ నుండి తీసిన వెంటనే చేపలను వేడి నీళ్లలో వేయకూడదు. వండటానికి 3–4 గంటల ముందే ఫ్రీజర్ నుండి తీసి సాధారణ ఫ్రిజ్ లో ఉంచాలి. ఆ తర్వాత బయటకు తీస్తే ఐస్ సులభంగా కరుగుతుంది. కాబట్టి ఇక చేపలను స్టోర్ చేసే ముందు ఇవి గుర్తుంచుకోండి.

Loading...
Unable to load recommendations.
Follow Us