
చాలా మంది భోజన ప్రియులకు చికెన్ ఇష్టమైన వంటకం. రోజుకు ఒకటి కంటే ఎక్కువ సార్లు దీనిని తినేందుకు ఇష్టపడతారు. కొంతమంది వారానికి ఒకటి లేదా రెండు సార్లు తింటుంటారు. ఒక్కోసారి భోజనం చేశాక వండిన చికెన్ మిగిలిపోతుంది. దీంతో చాలా మంది దీనిని రిఫ్రిజిరేటర్‌లో భద్రపరుస్తుంటారు. ఇలా ఫ్రిజ్‌లో ఎంత సేపటివరకు చికెన్ నిల్వ చేయవచ్చో మీకు తెలుసా?

వండిన చికెన్‌ను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (USDA) ప్రకారం.. పచ్చి చికెన్‌ను 1-2 రోజుల వరకు రిఫ్రిజిరేటర్‌లో ఉంచవచ్చు. అంతకన్నా ఎక్కువ రోజులు నిల్వ ఉండం అంత మంచిదికాదు. రెండు రోజులకుమించి పచ్చి చికెన్‌ను రిఫ్రిజిరేటర్‌లో ఉంచకపోవడమే మంచిది.

చికెన్ 65 : చాలా అదే వండిన చికెన్‌ను 3-4 రోజుల వరకు ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. చికెన్‌ను ఒక రోజు ఉడికించి ఫ్రిజ్‌లో ఉంచగలిగితే, నాలుగు రోజుల వరకు మళ్లీ వేడి చేయవల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా దీనిని తిరిగి వినియోగించవచ్చు.మంది ఇష్టపడే వంటకాల్లో చికెన్ 65 ఒకటి. ఇది చాలా మందికి ఫేవరెట్ డిష్. అయితే ఇది టెస్ట్ అట్లాస్ ప్రకటించిన 100 అద్భుతమైన వంకటకాల్లో 97వ స్థానంలో నిలిచింది. ఈ వంటకం చెన్నైకి చెందినది. ఇందులో అల్లం, నిమ్మకాయ, ఎర్ర మిరపకాయలు,వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో మ్యారినేట్ చేసిన డీప్-ఫ్రైడ్ చేసిన చికెన్ ఉంటుంది. 1965లో తమిళనాడులో AM బుహారీ సృష్టించారని అందుకే దీనికి చికెన్ 65 అనే పేరు వచ్చిందంటారు కొందరు.

వండిన చికెన్‌ను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసేటప్పుడు గాలి చొరబడని కంటైనర్‌ను ఉపయోగించాలి. వీలైతే గాజు టిఫిన్ బాక్స్‌ను ఉపయోగించడం మంచిది. వండిన చికెన్‌ను ఎక్కువసేపు ఉంచాలనుకుంటే, ఫ్రీజర్ బ్యాగ్‌ను ఉపయోగించవచ్చు.

వండిన మాంసాన్ని ప్లాస్టిక్ కంటైనర్లలో నిల్వ చేయకపోవడమే మంచిది. వండిన చికెన్‌ను రిఫ్రిజిరేటర్ నుంచి తీసిన వెంటనే వేడి చేయకూడదు. ఆహారం కొద్దిగా చల్లబడిన తర్వాత వేడి చేయాలి. అంతే కాదు రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసిన చికెన్‌ను మళ్లీ మళ్లీ వేడి చేయకూడదు. మీరు తినేంత సమయంలో మాత్రమే మళ్లీ వేడి చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే చికెన్ చెడిపోవచ్చు. అవసరమైతే, దానిని 2-3 గాలి చొరబడని కంటైనర్‌లలో నిల్వ చేయవచ్చు.