
చాలా మంది తల్లులు తమ పిల్లల పుట్టిన రోజు, ఏదైనా స్పెషల్ డేస్‌లలో పిజ్జా తయారు చేస్తుంటారు. అయితే పిజ్జా నార్మల్‌గా తినడం కంటే, దానిని సాస్‌తో తింటేనే రుచి అదిరిపోతుంది. చాలా మంది ఇంటిలో పిజ్జా తయారు చేసి మార్కెట్‌లో తయారు చేసిన సాస్‌తో తింటారు. కానీ అది అంతగా రుచిని ఇవ్వదు. కాగా, ఇంటిలోనే చాలా సులభంగా సాస్ ఎలా చేయాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్థాలు : కేజీ టమాటాలు, ఆలివ్ నూనె, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండు తులసి పొడి, మిరప కాయలు, ఉప్పు, నల్ల మిరియాల పొడి, నీరు.

తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా పాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి, దాని పై పెట్టాలి. అందు నూనె పోసి నూనె వేడి అయిన తర్వాత, అందులో ఉల్లిపాయ, వెల్లుల్లి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో టమాటాలను, తులసి పొడి మిరపకాయలు , మిరియాల పొడి వేసి బాగా కలపాలి.

తర్వాత ఈ మిశ్రమం మంచిగా వేగిన తర్వాత కప్పు నీళ్లు పోసి, దాదాపు ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు సన్నని మంటపై ఉడికించుకోవాలి. అది అంటుకోకుండా, ఉండలు లేకుండా ఉండటానికి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా చేయడం వలన చిక్కపడుతుంది.

ఇప్పుడు ఇది బాగా ఉడికి, చిక్కబడిన తర్వాత, రెస్టారెంట్ టేస్ట్ రావడానికి దీనిని కాసేపు చల్లార్చాలి. తర్వాత దీనిని వీలైతే మిక్సీ పట్టండి. అంతే టేస్టీ టేస్టీ సాస్ రెడీ. పిజ్జాతో దీనిని తింటే రుచి అదిపోతుంది. మరి మీరు కూడా ఇలా ట్రై చేయండి.