
కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బాస్మతి బియ్యం, పావు కిలో పనీర్ ముక్కలు, టమాటాలు, ఉల్లిపాయలు, 6 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు, ఒక టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి, అర గ్లాస్ నూనె, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, కొత్తిమీర, పుదీనా ఆకులు, పెరుగు తీసుకోవాలి.

Paneer Biryani 1

ఆ తర్వాత కుక్కర్‌లో అర కప్పు నూనె వేసి, అది కాగిన తర్వాత దానిలో నాలుగు బిర్యానీ ఆకులు, మూడు లవంగాలు, నాలుగు యాలకులు, ఒక దాల్చిన చెక్క వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి బంగారు కలర్ వచ్చే బాగా వేయించాలి.

ఇప్పుడు ఒక టేబుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నాలుగు పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత నాలుగు టమాటా ముక్కలు వేసి అవి కూడా మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించాలి.

ఇక ఇప్పుడు నానబెట్టిన బియ్యం దానిలో వేసి తగిన నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టేసి.. 5 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించాలి. బియ్యం, పనీర్ ముక్కలు బాగా ఉడికిన తరువాత గ్యాస్ ఆఫ్ చేసి 20 నిమిషాల పాటు ఉంచి కిందకు దించాలి.