
నాటు కోడిని ఎంతో మంది ఇష్టంగా తింటారు. అయితే, ఆంధ్రాలో నాటుకోడి చిల్లి గారె, నాటు కోడి పులుసు రాగి ముద్ద ఇలా కాంబినేషన్ చేసుకుంటారు. ఇవి చాలా ఫేమస్. అయితే, నాటుకోడి కూర వేరు.. నాటుకోడి పులుసు వేరుగా చేస్తారు. ఇక్కడ విజయవాడ స్పెషల్ నాటు కోడి పులుసు ఎలా తయారు చేస్తారో ఇక్కడ చూద్దాం..

నాటు కోడి పులుసుకు కావాల్సిన పదార్థాలు:ఒక కిలో నాటుకోడి మాంసం, నాలుగు ఉల్లిపాయలు, మూడు టమాటాలు , రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 పచ్చిమిరపకాయలు , అర టేబుల్ స్పూన్ పసుపు , రెండు టేబుల్ స్పూన్స్ కారం , రెండు టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా , రుచికి సరిపడా ఉప్పు, మూడు టేబుల్ స్పూన్స్ నూనె, నాలుగు కరివేపాకు, కొత్తిమీరను తీసుకోవాలి.

నాటు కోడి పులుసు తయారీ విధానం: 10 ఎండుమిరపకాయలు , రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ మిరియాలు , నాలుగు లవంగాలు , దాల్చిన చెక్క చిన్న ముక్క , నాలుగు యాలకులు , అర కప్పు కొబ్బరి తురుమును తీసుకోవాలి. ఈ పొడే కీలకం

ముందుగా నాటుకోడి మాంసాన్ని తీసుకుని కడిగి పసుపు, ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 20 నిమిషాల పాటు దీనిని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ మసాలా పదార్థాలను తీసుకుని బాగా వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి. కుక్కర్‌లో ఆయిల్ వేసి, అది బాగా వేడయ్యాక ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసి వేయించాలి.

ఇక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిముషాలు బాగా వేయించాలి. ఇంకా దీనిలో నాలుగు టమాటాలు కూడా వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. ఇప్పుడు దీనిలో నాటుకోడి మాంసం వేసి వేయించాలి. దీనిలో కారం, కొద్దిగా ధనియాల పొడి, ఇంకా దీనిలో మసాలా పొడి వేసి కలపాలి. సరిపడా నీళ్లు పోసి ఉడికించాలి. చివర్లో కొత్తిమీర కూడా దించేయాలి.