Cooking Tips: అక్కడే ఉంది అసలైన ట్రిక్.. పాలపై మందపాటి మీగడ రావాలంటే జస్ట్ ఇలా చేయండి

Updated on: Aug 14, 2026 | 1:10 PM

Get Thick Milk Cream at Home: పాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి మనకు అనేక రకాలుగా ఉపయోగపడతాయి. ఈ పాలతోనే టీ, కాఫీ, ఇంట్లో స్వీట్లు, పెరుగు.. ఇలా ఎన్నో తయారు చేసుకోవచ్చు. అయితే బయటి నుంచి తెచ్చుకోవడం ఎందుకులే అని చాలామంది ఇంట్లోనే పాలతో నెయ్యి, వెన్న తయారు చేసుకుంటారు. ఇందుకు పాల మీగడ చాలా అవసరం. కానీ కొన్నిసార్లు మీగడ సరిగ్గా రాకపోవడం పెద్ద సమస్యగా మారుతుంది. పాలను గంటల తరబడి ఉంచినా గట్టి మీగడ రాదు. మీరు కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటుంటే.. ఈ చిన్న చిట్కాలు పాటించండి. వీటితో సులభంగా మందపాటి మీగడను పొందవచ్చు. అదెలాగో ఇక్కడ చూద్దాం:

1 / 5
సరైన పాలు: మీగడ బాగా రావాలంటే పాల నాణ్యత చాలా ముఖ్యం. కాబట్టి మీగడ కోసం ఫుల్-ఫ్యాట్ లేదా ఎక్కువ కొవ్వు ఉన్న పాలను తీసుకోండి. ఈ పాలను వాడితే మీగడ ఎక్కువగా, మందంగా వస్తుంది. ఒకవేళ మీరు ప్యాకెట్ పాలు వాడితే ఫుల్-క్రీమ్ మిల్క్ తీసుకోండి. కొవ్వు తక్కువగా ఉండే టోన్డ్ మిల్క్ వాడితే పాలపై ఎక్కువ మీగడ ఏర్పడదు.

2 / 5
పాలు కాచే పద్ధతి: మంచి మీగడ కోసం పాలను సరిగ్గా కాచడం కూడా ముఖ్యమే. మీగడ కోసం పాలను ఎప్పుడూ మందపాటి అడుగు భాగం ఉన్న గిన్నెలోనే మీడియం మంటపై (ఫ్లేమ్) కాయండి. అవి పొంగు వచ్చే వరకు లేదా బాగా మరిగే దాకా సిమ్‌లో పెట్టి, కొద్ది నిమిషాల పాటు అలాగే మరగనివ్వండి. అలాగే పాలు అడుగంటకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉండండి.

3 / 5
వెడల్పాటి పాత్ర: పాలు బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి, వెంటనే పూర్తిగా మూత పెట్టకండి. కొద్దిసేపు ఆవిరి బయటకు పోనివ్వండి. పాలను శుభ్రమైన వెడల్పాటి పాత్రలో ఉంచితే.. పాలపై ఏర్పడే మీగడ పొర పెద్దగా వస్తుంది. దీనివల్ల మీగడ మందంగా, ఎక్కువగా వస్తుంది.

4 / 5
నిల్వ చేసే విధానం: పాలను చల్లార్చేటప్పుడు గిన్నెను అటూఇటూ కదల్చకండి. పూర్తిగా చల్లారిన తర్వాత దానిపై మూత పెట్టి ఫ్రిజ్‌లో ఉంచండి. ఫ్రిజ్‌లో పెట్టిన తర్వాత దాన్ని అస్సలు కదల్చవద్దు. రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచి, ఉదయాన్నే దానిపై పేరుకున్న మీగడను నిదానంగా తీసి ఒక బాక్స్‌లో వేసుకోండి. ఆ బాక్స్‌ను ఫ్రిజ్‌లోనే నిల్వ చేసుకుని, అవసరమైనప్పుడు దాంతో వెన్న, నెయ్యి తయారు చేసుకోవచ్చు.

5 / 5
ముఖ్య గమనిక: పాలను కాచేందుకు ఎప్పుడూ శుభ్రమైన పాత్రలనే వాడండి. పాల నుంచి పుల్లటి వాసన వచ్చినా లేదా పాడైపోయినట్లు అనిపించినా వాటిని వాడకండి. ఎలాంటి కల్తీ లేకుండా, సరైన పాలతో ఈ పద్ధతిని పాటిస్తే ఇంట్లోనే స్వచ్ఛమైన, మందపాటి మీగడను సులభంగా పొందవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us