వైట్ హౌస్ ను తలపించేలా కొత్త సెక్రెరియేట్ భవనాన్ని ఆరు అంతస్తులతో నిర్మించారు. సచివాలయంలో 635 గదులు ఉన్నాయి. ఎసి కోసం ప్రత్యేకంగా ఒక ప్లాంట్‌ను నెలకొల్పారు. 30 సమావేశ మందిరాలు.. 34 గుమ్మటాలు, 24 లిఫ్ట్‌లను, అన్ని రకాల అవసరాల కోసం 5.60 లక్షల లీటర్ల నిల్వ ఉండేలా ట్యాంకులను ఏర్పాటు చేశారు. కరెంట్ పొదుపునకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొత్తం 28 ఎకరాల విస్తీర్ణంలో రెండున్నర ఎకరాల్లో ఈ భవనాన్ని నిర్మించారు. సచివాలయం ముందువైపు రెండు బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్, ఎటిఎం సెంటర్లు, రైల్వే కౌంటర్, బస్ కౌంటర్, క్యాంటీన్‌లు ఉన్నాయి. వెనుకవైపు ఉద్యోగుల అసోసియేషన్, ఇండోర్ గేమ్స్, హౌసింగ్ సొసైటీ కార్యాలయాల కోసం నాలుగు అంతస్తులతో ఒక బిల్డింగ్‌ను నిర్మించారు.