Oldest cities in the world: వేల సంవత్సరాల చరిత్ర.. చెక్కు చెదరని కళా వైభవం.. ప్రపంచంలోని అత్యంత పురాతన నగరాలు ఇవే..

|

Feb 25, 2023 | 4:39 PM

ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరం ఏది? అని అడిగితే సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే ఒక్కో నగరానికి ఒక్కో చారిత్రక నేపథ్యం ఉంటుంది. ప్రతి నగరానికి దాని విశిష్టత దానికి ఉంటుంది. పురావస్తు శాస్త్రవేత్తల పని అదే. అక్కడి సంప్రదాయం, సంస్కృతి, జీవన విధానం వంటి వాటిపై ఆధారపడి ఆ నగర చరిత్రను వివరిస్తారు. ఈ ఆధునిక యుగంలో అనేక మంది రాజులు, రాజ్యాలు అంతరించిపోయిన.. ఆనాటి కళా వైభవం నేటికీ కొన్ని చోట్ల మనకు కనిపిస్తుంటుంది. మీకు అటువంటి ప్రదేశాలను, అలనాటి కట్టడాలను చూడాలని ఇష్టపడితే మీ కోసమే ఈ కథనం. ప్రపంచంలోని అత్యంత పురాతన, చారిత్రక నేపథ్యం ఉన్న నగరాలను మీకు పరిచయం చేస్తున్నాం. మీరూ ఓ సారి చుట్టేసి రండి..

1 / 5
జెరిఖో, వెస్ట్ బ్యాంక్, అమెరికా:సుమారు 8,000 ఏళ్ల నాటి నుంచి ఇక్కడ మనుష్యులు ఉంటున్నారని చరిత్రకారులు చెబుతున్నారు. నాటి మానవ నివాసానికి సంబంధించిన ఆధారాలతో జెరిఖో  పట్టణం ఆకట్టుకుంటుంది. చారిత్రాత్మక నిర్మాణాలు, చర్చిలు కనువిందు చేస్తాయి.

2 / 5
ఏథెన్స్, గ్రీస్:3,400 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర కలిగిన పురాతన నగరం ఏథెన్స్ ఐరోపాలోని పురాతన నగరాలలో ఒకటి. ఇది ప్రజాస్వామ్యం, పాశ్చాత్య తత్వశాస్త్రాలకు మూలంగా పరిగణించబడుతుంది. ఒలింపియన్ జ్యూస్ ఆలయంతో సహా ఇతర ప్రసిద్ధ భవనాలతో పాటు, నగరం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన అక్రోపోలిస్‌కు నిలయంగా ఉంది.

3 / 5
వారణాసి, భారతదేశం:దీనిని బెనారస్ లేదా కాశీ అని కూడా పిలుస్తారు. ఇది ఉత్తర భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న ప్రపంచంలో నిరంతరం నివసించే పురాతన నగరాలలో ఒకటి. ఇది భారతదేశ ఆధ్యాత్మిక రాజధానిగా పరిగణించబడుతుంది. హిందూ సంప్రదాయం ప్రకారం గంగానదిలో పవిత్ర స్నానాలు చేయడం.. చనిపోయిన వారి అస్తికలను కలపడం ఇక్కడ ప్రత్యేకత.

4 / 5
సిరియా అలెప్పో: అలెప్పో అనేది సిరియాలోని ఒక చారిత్రాత్మక నగరం. ఇక్కడ 8,000 సంవత్సరాల చరిత్ర ఉందని పురావస్తు ఆధారాలు ఉన్నాయి. ఇది హిట్టైట్లు, అస్సిరియన్లు, అరబ్బులు, మంగోలులు, మామెలుకే ఒట్టోమన్లచే ఇది పాలించబడింది.

5 / 5
బైబ్లోస్, లెబనాన్:
దీనిని జుబైల్ అని కూడా పిలుస్తారు, ఇది ప్రపంచంలోని అత్యంత పురాతనమైన పట్టణాలలో ఒకటి, ఇది మొదటిసారిగా 8800, 7000 BC మధ్య 5000 BC నుండి ఇక్కడ మనుషులున్నారని నమ్ముతారు.

బైబ్లోస్, లెబనాన్: దీనిని జుబైల్ అని కూడా పిలుస్తారు, ఇది ప్రపంచంలోని అత్యంత పురాతనమైన పట్టణాలలో ఒకటి, ఇది మొదటిసారిగా 8800, 7000 BC మధ్య 5000 BC నుండి ఇక్కడ మనుషులున్నారని నమ్ముతారు.