
సమ్మర్ డ్రింక్ కు కావాల్సిన పదార్థాలు: నాలుగు పటిక బెల్లం టేబుల్ స్పూన్లు, గుప్పెడు పుదీనా ఆకులు, రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం , రెండు గ్లాసుల చల్లని నీరు, కొద్దిగా ఉప్పు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఇంకా ఐస్ క్యూబ్స్ కూడా తీసుకోవాలి. ఇవి అయితే, శరీరంలో ఉన్న వేడిని కూడా తగ్గిస్తాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.

పుదీనా పేస్ట్ ఈ విధంగా తయారు చేసుకోవాలి: ముందుగా పుదీనా ఆకులను తీసుకుని వాటిని కడిగి ఒకటికి రెండు సార్లు నీటితో బాగా కడిగి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఆ తర్వాత వాటిని వాటిని మిక్సీ జార్‌లో వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. పుదీనా ఆకులు మాత్రం తాజాగా ఉండేలా చేసుకోవాలి.

ఇప్పుడు వీటిని ఇలా మిక్సింగ్ చేసుకోవాలి : ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో పక్కన పెట్టుకున్న పటిక బెల్లం వేసి నీరు పోయాలి. ఆ తర్వాత దానిలో పుదీనా పేస్ట్ కూడా వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం కూడా వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇంకా దీనిలో కొద్దిగా ఉప్పు, జీలకర్ర కూడా కలుపుకోవాలి.

ఇంకా దీనిలో పంచదార కూడా వేయాలి : ఇంకా ఈ డ్రింక్‌కు తీపి పులుపు టేస్ట్ కావాలంటే కొద్దిగా పంచదార కూడా వేసుకోవాలి. ఆ తరవాత కూలింగ్ వాటర్ తీసుకుని దానిలో వేసుకోవాలి. ఇక చివర్లో ఐస్ క్యూబ్స్ కూడా వేసి గ్లాస్‌లో పోసుకుని తాగడమే.. అలాగే, నాలుగు పుదీనా ఆకులతో గార్నిష్ చేస్తే ఇంకాస్త అందంగా కనిపిస్తుంది.

ఎండ రోజు రోజుకి పెరిగిపోతోంది ఈ సమయంలో సరైన డ్రింక్స్ తీసుకోకపోతే శరీరంలో వేడి ఎక్కువవుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళకుండా మీ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుని తాగండి. దీనిని తాగితే వేడి మొత్తం కొట్టేస్తుంది. (నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)