
మిల్లెట్ బియ్యం : వరి బియ్యానికి బదులుగా కొందరు మిల్లెట్ బియ్యాన్ని ఫుడ్ డైట్ లో చేర్చుకుంటున్నారు. ఎందుకంటే, దీనిలో అధిక ఫైబర్, ప్రోటీన్, ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఇవి వీటిలో ఉండటంతో షుగర్, బీపీని కంట్రోల్ చేస్తాయి. అంతేకాదు ఇంకా వీటిని తినడం వలన జీర్ణక్రియ పని తీరును మెరుగుపరచి, ఇంకా బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

ఇప్పుడున్న కాలంలో ఆహారపు అలవాట్లు రోజు రోజుకు వేగంగా మారిపోతున్నాయి. ఇంకా చిన్న వయసులోనే ఎన్నో సమస్యలు వస్తున్నాయి. వాటిలో ఎక్కువగా మధుమేహం, బీపీ ఎక్కువ. ఇలాంటి వారు మిల్లెట్స్ ను డైట్ లో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇంకా ఇవి ఆరోగ్య పరంగాన కూడా ఎన్నో లాభాలను అందిస్తాయి. మీరు కూడా వీటిని తినండి.

మిల్లెట్ బియ్యం రెసిపీకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు మిల్లెట్ బియ్యం, రెండు గ్లాస్ ల నీరు, రుచికి సరిపడా ఉప్పు , ఒక టేబుల్ స్పూన్ నెయ్యి లేదా నూనెను తీసుకోవాలి. అయితే, వీటిని సరైన కొలతలతో వండుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఫాలో అయ్యి మీ ఇంట్లో ఇలా వండుకోండి.

మిల్లెట్స్ బియ్యం తయారీ విధానం: ముందుగా మిల్లెట్స్ ను రెండు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇంకా వీటిని 15 నుంచి 20 నిముషాల పాటు నానబెట్టుకోవాలి. ఎందుకంటే, ఇలా చేస్తే త్వరగా ఉడుకుతుంది. ఇంకా కుక్కర్లో కానీ పాత్రలో కానీ నీరు పోసి వాటిని బాగా మరిగించి ఆ తరవాత నానబెట్టిన మిల్లెట్ బియ్యాన్ని దానిలో వేయాలి. రుచికి తగినంత కొద్దిగా ఉప్పు, నెయ్యి కూడా వేసుకోవచ్చు.

అయితే, దీనిని పప్పు, సాంబార్, కూరలతో కూడా తినొచ్చు. ఇంకా పెరుగుతో తిన్నా కూడా రుచిగా ఉంటుంది. (నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)