
గుండె ఆరోగ్యానికి అవిసె గింజల లడ్డు: కుటుంబంలో గుండె జబ్బులు ఉన్నవారు, బైపాస్ సర్జరీ అయినవారు, అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఉన్నవారు అవిసె గింజల లడ్డును తీసుకోవడం మంచిది. అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని దోరగా వేపించి, ఖర్జూరం, యాలకుల పొడి కలిపి, తేనె లేదా చెరుకు పానకంతో లడ్డులా చేసుకోవాలి. షుగర్ వ్యాధి ఉన్నవారు తీపిని తగ్గించి తీసుకోవచ్చు.

ప్రోటీన్ లోపానికి పుచ్చ గింజల లడ్డు: ఎదుగుదల తక్కువగా ఉన్న పిల్లలకు, ప్రోటీన్ లోపం ఉన్నవారికి పుచ్చ గింజల పప్పు లడ్డు మంచిది. ఈ పుచ్చ గింజల పప్పులో 34% వరకు ప్రోటీన్ ఉంటుంది. వీటిని దోరగా వేపించి, ఖర్జూరం, తేనె, చెరుకు పానకం, బెల్లంతో లడ్డు చేసుకోవచ్చు.

కాల్షియం లోపానికి నువ్వుల లడ్డు:పిల్లలు, పెద్దలు ఎవరికైనా కాల్షియం లోపం, ఎముకలు గుల్లబారడం, మెనోపాజ్ దశలో కాల్షియం అవసరం ఉన్నవారు నువ్వుల లడ్డును తప్పనిసరిగా తీసుకోవాలి. తెల్ల నువ్వులను దోరగా వేపించి, ముక్కా చెక్కలా చేసి, ఖర్జూరం పొడి, తేనె లేదా బెల్లం పొడి కలిపి లడ్డు చేసుకోవాలి. నువ్వులలోని సహజ నూనెలతోనే లడ్డు చక్కగా తయారవుతుంది.

యవ్వనంగా కనిపించడానికి ప్రొద్దు తిరుగుడు పప్పు లడ్డు:ఎక్కువ కాలం యవ్వనంగా కనిపించాలనుకునే వారికి, విటమిన్ ఇ అవసరమైన వారికి ప్రొద్దు తిరుగుడు పప్పు లడ్డు బెస్ట్. ప్రొద్దు తిరుగుడు పప్పును వేపించి, ఖర్జూరం, తేనె లేదా చిక్కటి చెరుకు పానకంతో లడ్డు చేసుకోవచ్చు. ఇది విటమిన్ ఇ సప్లిమెంట్లకు మంచి ఎంపిక ఎంపిక.

మెదడు ఆరోగ్యానికి వాల్‌నట్స్, బాదం లడ్డు: మతిమరుపు, మెదడు బలహీనత వంటి సమస్యలు ఉన్న పెద్దలకు వాల్‌నట్స్, బాదం పప్పుల లడ్డు మంచిది. వీటిని వేయించి లడ్డులా చేసుకుంటే మెదడు కణాల డిటాక్సిఫికేషన్, నరాల కణాల పోషణకు అవసరమైన ఒమేగా ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి.