
జొన్నఆవిరి కుడుముకు కావలసిన పదార్థాలు: రెండు కప్పులు జొన్న పిండి, అర కప్పు బియ్యపు రవ్వ , ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు కరివేపాకు ఆకులు, కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, తగినన్ని నీళ్లు రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

జొన్నఆవిరి కుడుము తయారీ విధానం: ముందుగా బియ్యపు రవ్వను తీసుకుని 10 నిమిషాలు పాటు వీటిని నీటిలో నానబెట్టాలి. ఇంకా ఒక చిన్న గిన్నెలో జొన్న పిండి, అలాగే, నానబెట్టిన రవ్వను వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా దీనిలో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు కరివేపాకు ఆకులు, అర కట్ట కొత్తిమీర, ఇంకా ఉప్పును కూడా వేసి బాగా కలపాలి.

జొన్నఆవిరి కుడుము తయారీ విధానం స్టెప్ 1 : ఇక ఇప్పుడు కొంచం కొంచం నీరు పోస్తూ ఇది గట్టిగా ఉండే వరకు పిండిని బాగా కలుపుకోవాలి. ఆ తరవాత చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుని వీటిని మీడియం సైజులో కుడుములను తయారు చేసుకోవాలి. కొద్దీ సేపు ఈ మిశ్రమాన్ని అలా పక్కన ఉంచి ఇడ్లీ పాత్రలో కానీ లేదా చిన్న ఆవిరి పాత్రలో కానీ ఈ కుడుములను పెట్టి బాగా ఉడికించాలి.

జొన్నఆవిరి కుడుము తయారీ విధానం స్టెప్ 1 : ఈ కుడుములను పెట్టిన తరవాత మీడియం మంటపై కనీసం 30 నిమిషాల పాటు ఆవిరిలో బాగా ఉడికించాలి. ఇది బాగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్ లేదా గిన్నెలోకి తీసుకుని కొబ్బరి చట్నీతో కానీ మామిడి కాయ చట్నీతో తింటే రుచి అదిరిపోతోంది. ఇది వరకు రోజుల్లో రైతన్నలు ఇవే తినేవాళ్లు.

జొన్న కుడుములు వలన ఎన్నో లాభాలు : జొన్న పిండి మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా ఈ కుడుములు తినడం వలన జీర్ణక్రియ సమస్యలు కూడా తగ్గుతాయి. బరువు తక్కువగా ఉన్నవారు వీటిని తింటే మంచి ఫలితం ఉంటుంది. ఉదయం పూట ఈ బ్రేక్‌ఫాస్ట్‌గా తింటే ఆకలి వెయ్యదు. అలాగే, షుగర్ ఉన్నవారికి కూడా ఇది సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు.