Health Tips: మూడ్‌ ఆఫ్‌లో ఉండకండి.. సింపుల్‌ చిట్కాలతో రిలాక్స్‌ అవ్వండి.. మనసు ప్రశాంతంగా ఉంటుంది..

|

Mar 27, 2023 | 4:10 PM

నేటి జీవనశైలి, పని ఒత్తిడి మధ్య, మనస్సును రిలాక్స్‌గా, ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇది మీ శక్తి సామర్థ్యాలు, పనితీరును పెంచుతుంది. బ్రెయిన్‌ మరింత యాక్టివ్‌గా పనిచేస్తుంది. రిలాక్స్‌గా ఉండటానికి ఇక్కడ కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి. ఇలాంటి చిట్కాలు పాటిస్తే మీరు ఈజీగా రిలాక్స్‌ అవుతారు..అవేంటో తెలుసుకుందాం..

1 / 5
ధ్యానం: ఒత్తిడిని తగ్గించుకోవడానికి అన్ని పనులతో పాటుగా మనస్సును ప్రశాంతంగా, ఒత్తిడి లేకుండా ఉంచుకోవడానికి ధ్యానం అద్భుతంగా పనిచేస్తుంది. ఉదయం లేదా సాయంత్రం ఏకాంత ప్రదేశంలో కూర్చుని, మీ కళ్ళు మూసుకుని మీ శ్వాసపై దృష్టి పెట్టండి. దీని ప్రభావం కొద్ది రోజుల్లోనే కనిపించడం ప్రారంభమవుతుంది.

2 / 5
వ్యాయామం: ఒత్తిడికి దూరంగా ఉండటానికి, మీ మానసిక స్థితిని చక్కగా ఉంచుకోవడానికి శారీరక కార్యకలాపాలు ఉత్తమ మార్గం. రన్నింగ్, వాకింగ్, యోగా క్లాసులు, వ్యాయామం మనస్సును రిలాక్స్ చేయడంలో సహాయపడతాయి. మిమ్మల్ని ఒత్తిడి లేకుండా ఉంచుతాయి.

3 / 5
చదివే అలవాటు : మీరు రోజూ ఏదైనా పుస్తకం, నవల లేదా కథ చదివితే, అది మిమ్మల్ని ఒత్తిడి నుండి దూరం చేస్తుంది. రోజులో కొంత సమయం చదవడం కోసం కేటాయించండి., మనసు టెన్షన్, ఒత్తిడి లేకుండా ఉంటుంది.  ఇది చాలా వేగంగా పనిచేస్తుంది. మనస్సును రిలాక్స్‌గా ఉంచడానికి చదవడం చాలా సులభమైన మార్గం.

4 / 5
మీకు ఇష్టమైన వారితో గడపండి: కుటుంబం, స్నేహితులతో సమయం గడపడం అనేది మనసు ఆందోళనలు మరియు ఒత్తిడిని తగ్గించడానికి ఒక అద్భుతమైన మార్గం. మీ ప్రియమైన వారితో కొంత సమయం గడపడం వల్ల మీకు సంతోషం, మనసు ప్రశాంతంగా ఉంటుంది. వారితో కలిసి భోజనాలు చేయండి. మంచి మాటలు మాట్లాడుకోండి.

5 / 5
సంగీతం వినడం: సంగీతం మన మానసిక స్థితి, భావోద్వేగాలను చాలా మెరుగుపరుస్తుంది. ఇది మనల్ని సంతోషంగా ఉంచడానికి సహాయపడుతుంది. రోజులో కొంత సేపు మ్యూజిక్ వింటే టెన్షన్ తగ్గి మైండ్ రిలాక్స్ అవుతుంది. సంగీతం మానసిక స్థితిని శక్తివంతంగా మారుస్తుందని అనేక పరిశోధనలలో కూడా తేలింది.