సీతాఫలంలో విటమిన్ సీ తోపాటు ఏ, బీ, కే విటమిన్లు, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్ అధికంగా ఉంటాయి. సీతాఫలం తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. బ్రేక్ ఫాస్ట్ కు బదులు వీటిని తింటే కూడా మంచి ప్రయోజనాలే ఉంటాయి. సీతాఫలంలోని మెగ్నీషియం, సోడియం, పొటాషియం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.